BJP: ఏపీ రాజకీయాలలో ప్రస్తుతం పొత్తుల ఎత్తులతో జనసేన వ్యూహాలని వేస్తుంది. గత ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే పొత్తు ఉన్నా కూడా బీజేపీ, జనసేన కలిసి ఎప్పుడూ కూడా ప్రజా సమస్యలపై కలిసి పోరాడలేదు. ఈ విషయం అందరికి తెలుసు. అయితే 2024 ఎన్నికలలో బీజేపీ, జనసేన కలిసి వెళ్ళడం ద్వారా తృతీయ ప్రత్యామ్నాయం అయ్యే అవకాశాలని ఉపయోగించుకోవాలని బీజేపీ ప్లాన్ చేసింది. అందులో భాగంగానే జనసేనతో కలిసి ప్రయాణం చేసింది. అయితే ఊహించని విధంగా ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా తన స్టాండ్ మార్చేశారు. అధికార పార్టీ వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా రాజకీయాలు చేయడానికి సిద్ధం అయ్యారు.
ఇందులో భాగంగా వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటూ కామెంట్స్ చేశారు. అదే సమయంలో తన దగ్గర మూడు ఆప్షన్స్ ఉన్నాయని రాజకీయ పార్టీల అంచనాలకి వదిలేసారు. బీజేపీ జనసేన కలిసి వెళ్ళడం, మూడు పార్టీలు కలిసి పోటీ చేయడం, జనసేన మాతరమే ఒంటరిగా పోటీ చేయడం అనే ఆప్షన్స్ ఇచ్చాడు. అయితే బీజేపీ మొదటి ఆప్షన్ కి మొగ్గు చూపిస్తుంది. ఇక టీడీపీ రెండో ఆప్షన్ కోరుకుంటుంది. అయితే జనసేన కార్యకర్తలు మాత్రం పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్న మాకు ఒకే అని అంటున్నారు. ఈ నేపధ్యంలో జనసేనాని పవన్ కళ్యాణ్ తన వ్యూహాత్మక ఎత్తుగడలలో భాగంగా తమ ఓటు బ్యాంకు ఎంత ఉంది అనేది తెలియజేస్తూ 57 సీట్ల వరకు తమకి ఇవ్వాలని టీడీపీకి డిమాండ్ చేస్తున్నారు.
అయితే టీడీపీ ఆ స్థాయిలో సీట్లు ఇవ్వడానికి సిద్ధంగా లేకపోయిన కచ్చితంగా జనసేన తమతో కలిసి రావాలని కోరుకుంటుంది. జనసేన వస్తే అధికారంలోకి వస్తామని భావిస్తుంది. అయితే పవర్ షేరింగ్ కాని, కోరుకున్న సీట్లు కాని ఇవ్వడానికి సిద్ధంగా లేరు. అయితే పవన్ కళ్యాణ్ ఎన్నికలకి ఎలా వెళ్ళేది క్లారిటీ ఇవ్వకపోవడంతో బీజేపీ కన్ఫ్యూజన్ లో ఉంది. పవన్ కళ్యాణ్ తమతో కలిసి రావాలని కోరుకుంటున్నా కూడా ఇద్దరం కలిసి పోటీ చేస్తామని బీజేపీ నాయకులు బలంగా చెప్పలేకపోతున్నారు.
ఈ నేపధ్యంలో బీజేపీ చీఫ్ సోము వీర్రాజు మాటలు కూడా మారుతున్నాయి. కుటుంబ పార్టీల పాలనకి బీజేపీ పూర్తి వ్యతిరేకం అని పేర్కొన్నారు. జనసేనతమతో కలిసి వస్తే పొత్తులో వెళ్తామని, లేదంటే ఒంటరిగానే ఎన్నికలలో పోటీ చేస్తామని చెబుతున్నారు. టీడీపీ, వైసీపీలకి మాత్రం సపోర్ట్ ఇచ్చే ఛాన్స్ లేదని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ బీజేపీతో బంధంతో పై గట్టి భరోసా ఇవ్వకపోవడంతో బీజేపీ ఇప్పుడు జనసేనానిని అనుమానంతోనే చూస్తుంది.