Wed. Jan 21st, 2026

    BJP: తాజాగా జరిగిన కర్ణాటక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఘోర పరాజయం సొంతం చేసుకుంది. కేవలం 64 స్థానాల్లో మాత్రమే గెలిచింది. ముఖ్యంగా బిజెపి ఓటమిలో తెలుగు ఓటర్లు ప్రభావం చాలా ఎక్కువగా ఉందని మాట వినిపిస్తోంది. కర్ణాటక ఎన్నికల ప్రభావం రానున్న తెలంగాణలో కూడా ఉండే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రానున్న తెలంగాణ ఎన్నికలలో అధికార పార్టీ బీఆర్ఎస్ ను ఓడించి తమ దశాబ్దాల కల నెరవేర్చుకోవాలని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. తెలుగు రాష్ట్రాలలో ఇప్పటివరకు భారతీయ జనతా పార్టీ పెద్దగా ప్రభావం చూపించలేదు.

    Telangana BJP: Will BJP Repeat UP Performance In TS? - English OKTelugu

    అలాంటిది గత కొంతకాలంగా తెలంగాణలో బలమైన ప్రత్యర్ధిగా మారింది. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కి బీజేపీ బలమైన పోటీదారు అనే భావన ప్రజల్లోకి కూడా తీసుకొని వెళ్లారు. ఇదిలా ఉంటే కర్ణాటక ఎన్నికల్లో పార్టీ భారతీయ జనతా పార్టీ ఓటమి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కొత్త ఉత్తేజాన్ని అందించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పార్టీని వీడిన లీడర్స్ అందరిని తిరిగి రమ్మని ఆహ్వానిస్తున్నారు. నేరుగా మీడియా ముందుకు వచ్చి కాంగ్రెస్ వీడిన అందరూ కూడా మరల తిరిగి రావాలని కోరారు. అయితే ఈ విషయంలో బిజెపిలో చేరిన నాయకులందరూ చాలా క్లారిటీగా ఉన్నట్లు తెలుస్తుంది.

    BJP eyes big push in Telangana as its national executive meets in Hyderabad | India News – India TV

    కర్ణాటక లో పోల్ మేనేజ్మెంట్ ఫెయిల్ కావడంతో తెలంగాణలో స్ట్రాటజీ మార్చాలని బీజేపీ భావిస్తుంది. ఆ దిశగానే వ్యూహాలను సిద్ధం చేసే ప్రయత్నంలో ఉంది. ఇది ఇలా ఉంటే ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది బిజెపి మరింత బలంగా ప్రజల్లోకి వెళ్లేందుకు సన్నద్ధం అవుతూ ఉండటం విశేషం. మరి తెలంగాణ ప్రజలను అమిత్ షా నేతృత్వంలో బీజేపీ ఎంత వరకు ఆకట్టుకొని వచ్చే ఎన్నికలలో అధికార పీఠం సొంతం చేసుకుంటుంది. అనేది ఆసక్తికరంగా మారింది. ఏపీలో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచనలను పరిగణంలో తీసుకుని పొత్తులలోని వెళ్ళాలని ఆలోచనలో బీజేపీ కేంద్ర నాయకత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది.