Health Tips: సాధారణంగా చాలామందికి కొన్ని చెడు అలవాటులో ఉంటాయి అది చెడు అలవాటు అని తెలిసినప్పటికీ దానిని మానుకోవడానికి ఏమాత్రం ప్రయత్నం చేయరు ఇలా చాలామంది అలవాటు పడినటువంటి చెడు అలవాట్లలో గోర్లు కొరకడం ఒకటి. ఏదైనా ఒక విషయం గురించి ఆలోచిస్తున్నా లేదా కంగారులో ఉన్నప్పటికీ చాలామందికి చేతులు తమ నోట్లోకి పోవడం గోర్లు కొరుకుతూ ఉండడం చేస్తుంటారు అయితే ఇలా గోర్లు కొరకడం ఆరోగ్యపరంగా ఆధ్యాత్మిక పరంగాను మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
ఇలా తరచూ గోర్లు కొరకడం వల్ల మనకు తెలియకుండానే ఎన్నో అనారోగ్య సమస్యలు మనల్ని చుట్టుముడుతుంటాయి. మరి గోర్లు కొరకడం వల్ల ఏ విధమైనటువంటి సమస్యలు తలెత్తుతాయి ఏంటి అనే విషయానికి వస్తే గోర్లు కొరకడం వల్ల మనకు తెలియకుండానే గోర్లలో ఉన్నటువంటి కంటికి కనిపించినటువంటి బ్యాక్టీరియాలు మన కడుపులోకి చేరుతాయి. తద్వారా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు రావడానికి కారణం అవుతాయి. ఇలా ఎన్నో హానికర బ్యాక్టీరియాలో ప్రేగుల ద్వారా కడుపులోకి పోవడంతో చాలామందికి తల తిరగడం వాంతులు రావడం తీవ్రమైన కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి.
ఇకపోతే మాటికి గోర్లు కొరకటం వల్ల పంటి సమస్యలు కూడా వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. గోర్లు కొరకడం వల్ల పళ్ళ పై ఉన్నటువంటి రూట్ తొలగిపోవడంతో దంతాల నష్టానికి కూడా దారి తీస్తుంది. దంతాలు దెబ్బతినడమే కాకుండా ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది అందుకే వీలైనంతవరకు గోర్లు కొరకకపోవడం ఎంతో మంచిది ఇక ఆధ్యాత్మిక పరంగా కూడా తరచూ గోర్లు కొరుకుతూ ఉండటం వల్ల ఆ ఇంట్లో ప్రతికూల శక్తులు ఏర్పడతాయని ఇది తమ పనులకు ఎంతో ఆటంకంగా మారుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.