Tue. Jan 20th, 2026

    Bigg Boss 7 : బాలీవుడ్ లో సూపర్ సక్సెస్ అయిన బిగ్ బాస్ రియాలిటీ షో మన తెలుగులోనూ బాగా క్రేజ్ సంపాదించుకుంది. తమిళంలో కూడా బాగా ఆదరణ దక్కించుకుంది. అక్కడ కమల్ హాసన్ ఇప్పటివరకూ హోస్ట్‌గా వ్యవహరించారు. ఇక మన తెలుగులో మొదటి సీజన్‌కి యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ రెండవ సీజన్‌కి నేచురల్ స్టార్ నాని హోస్ట్‌లుగా వ్యవహరించారు. ఆ తర్వాత మూడవ సీజన్ నుంచి కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తూ వచ్చారు. అంతేకాదు, ఆయనకి సంబధించిన అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్‌లో సెట్స్ వేసి షో రన్ చేశారు.

    అయితే, గత నాలుగు సీజన్స్ నుంచి ప్రేక్షకులు నాగార్జునని చూసి విసిగిపోయారట. హోస్ట్ చేసే విధానం కూడా బాగా బోర్ కొట్టినట్టు టాక్ వినిపిస్తోంది. ఇక మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే హైదరాబాద్‌లో షూట్ జరగడం వల్ల ఒకరోజు ముందే హౌజ్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో కూడా లీకై షో మీద ఆసక్తి తగ్గిపోయింది. ఇది గత సీజన్‌లో బాగా తెలిసింది.

    bigg-boss-7-This time both the set and the host of Bigg Boss are changing..do you know why..?
    bigg-boss-7-This time both the set and the host of Bigg Boss are changing..do you know why..?

    దాంతో టీఆర్పీ రేటింగ్ కూడా బాగా తక్కువ నమోదు అయింది. అందుకే, ఈ సారి బిగ్ బాస్ సీజన్ 8 ని చెన్నైలో నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట. అంతేకాదు, ఈ సీజన్‌కి హోస్ట్ కూడా నాగార్జునని కాదని సమాచారం. టెలివిజన్ రియాలిటీ షోలో నంబర్ 1 యారీ ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ షో సీజన్స్ కి హోస్ట్‌గా వ్యవహరించింది దగ్గుబాటి రానా.

    ఆయనే ఇప్పుడు బిగ్ బాస్ 7 కి హోస్ట్‌గా నిర్వాహకులు ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. రానా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడంలో మంచి పేరు తెచ్చుకున్నారు. అందుకే, స్టార్ మా బృందం త్వరలో మొదలుపెట్టబోయో బిగ్ బాస్ 1కి రానాని హోస్ట్‌గా ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తోంది. మరి దీనిలో నిజమెంత ఉందో మేకర్స్ నుంచి అఫీషియల్ కన్‌ఫర్మేషన్ వస్తే గానీ తెలియదు.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.