Bhogi: తెలుగు వారికి అతి పెద్ద పండుగలలో సంక్రాంతి పండుగ ఒకటి. సంక్రాంతి పండును మూడు రోజులపాటు ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. భోగి సంక్రాంతి కనుమ అంటూ ఈ పండుగను మూడు రోజుల వేడుకగా జరుపుకుంటారు. ఇక సంక్రాంతి పండుగ రోజున మొదట జరుపుకునేది భోగి ఈ ఏడాది భోగి జనవరి 14వ తేదీ కావడంతో ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజలందరూ కూడా భోగి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు.
భోగి రోజు ఉదయమే భోగి మంటలు వేచి భోగి మంటలపై నీటిని కాల్చి అందరూ స్నానాలు చేసి రంగు రంగు ముగ్గులు వేసి గొబ్బెమ్మలను పెట్టి పూజిస్తూ ఉంటారు. ఇక చిన్నపిల్లలు కనక ఇంట్లో ఉన్నట్లయితే వారిపై బోగి పళ్ళను పోస్తారు. ఈ భోగి పళ్ళను పోయడం వల్ల పిల్లలు ఆరోగ్యానికి ఎంతో మంచిదని భావిస్తారు కనుక భోగి రోజు భోగి పండ్లను వేయడం ఆనవాయితీగా వస్తుంది.
ఇలా ఎంతో సాంప్రదాయబద్ధంగా జరుపుకొని ఈ భోగి పండుగ రోజు పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదు అని పండితులు చెబుతుంటారు. మరి భోగి రోజు చేయకూడని ఆ పనులు ఏంటి అనే విషయానికి వస్తే.. భోగి పండుగ రోజు మనం పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు.అలాగే ఉల్లి, వెల్లుల్లి వంటి ఆహారాలకు కూడా దూరంగా ఉండాలని చెబుతారు. అలాగే నలుపు రంగు బట్టలను ధరించకూడదు. ఎవరిని కించ పరిచే విధంగా, అవమానించే విధంగా మాట్లాడకూడదు. మంటలో ప్లాస్టిక్ వస్తువులు, వ్యర్థాలు వంటివి వేయ కూడదు. కేవలం కట్టెలు మాత్రమే వేయాలి. ఇలా భోగి పండుగ రోజు ఈ పనులు చేయకూడదని పండితులు చెబుతున్నారు.