Wed. Jan 21st, 2026

    Bharateeyudu 2: కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘భారతీయుడు 2’. తాజాగా ఈ సినిమా నుంచి కంబ్యాక్ టీజర్ ను రిలీజ్ చేసింది చిత్రం. అసలు రిలీజ్ కాదనుకున్న సినిమా మళ్ళీ షూటింగ్ మొదలవడం, ఇప్పుడు టీజర్ రిలీజ్ అవడం అంటే మాటల్లో చెప్పలేము. శంకర్ లాంటి దర్శకుడి సినిమా అంటే అది ఏ రేంజ్ లో ఉంటుందో మరోసారి జస్ట్ కంబ్యాక్ టీజర్ తోనే అర్థమైంది.

    1996 లో వచ్చిన ‘భారతీయుడు’ చిత్రానికి ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్‌గా తెరకెక్కింది. కమల్ హాసన్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్థ్, బ్రహ్మానందం కీలక పాత్రల్లో నటించారు. నిర్మాతలకి, దర్శకుడు శంకర్ కి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడం వల్ల ఏకంగా సినిమానే ఆగిపోయింది. ఆ తర్వాత శంకర్ మెగా పవర్ స్టార్ రాం చరణ్ తో ఓ పాన్ ఇండియా చిత్రాన్ని, బాలీవుడ్‌లో అపరిచితుడు చిత్రాన్ని రీమేక్ చేస్తున్నట్టు ప్రకటుంచారు.

    bharateeyudu-2-Kamal Haasan's comeback teaser is out.
    bharateeyudu-2-Kamal Haasan’s comeback teaser is out.

    Bharateeyudu 2: కమల్ మార్క్ పర్ఫార్మెన్స్, శంకర్ మార్క్ మేకింగ్

    రాం చరణ్ సినిమా షూటింగ్ మొదలయ్యాక భారతీయుడు 2 చిత్రం కి సంబంధించిన ప్రాబ్లంస్ క్లియర్ అయి మళ్ళీ షూటింగ్ మొదలైంది. దాంతో రెండు సినిమాలను సమాంతరంగా తెరకెక్కించారు. రాం చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమా కూడా అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. కాగా, తాజాగా శంకర్-కమల్ హాసన్‌ల ‘భారతీయుడు 2’ చిత్రం నుంచి కంబ్యాక్ టీజర్ రిలీజై యూట్యూబ్‌లో సంచలనం సృష్ఠిస్తోంది.

    ఇది శంకర్ మార్క్ సినిమా అని ఆయన మేకింగ్‌లోనే అర్థమవుతోంది. బ్యాక్‌గ్రౌండ్ సాంగ్‌తో టీజర్ రిలీజ్ చేశారు. దేశవ్యాప్తంగా ప్రజల్ని పట్టి పీడిస్తున్న లంచం అనే పాయింట్ మీదే ఈ సీక్వెల్ మూవీ కూడా తెరకెక్కించారు. కమల్ మార్క్ పర్ఫార్మెన్స్, శంకర్ మార్క్ మేకింగ్ చూస్తే ప్రపంచవ్యాప్తంగా సరికొత్త రికార్డ్స్ నెలకొల్పుతుందని అందరిలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.