Bhagyashri Borse: మహానటితో పోల్చుకునేంత ఉందా..? అంటూ యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే గురించి నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో తప్పులేదనే చెప్పాలి. ఒకప్పటి అగ్ర తార అయిన సావిత్రి మహానటిగా దేశ వ్యాప్తంగా ఎలాంటి ఖ్యాతిని సంపాదించుకున్నదో అందరికీ తెలిసిందే. అలాంటి మహానటితో మరో హీరోయిన్ ని ఎట్టి పరిస్థితుల్లోనూ పోల్చడం సరికాదు..అలా పోల్చిన వారికీ తగిన అర్హత ఉండాలి. చెప్పాలంటే అలాంటి హీరోయిన్ ఒక జనరేషన్ లో సౌందర్య మాత్రమే అని చెప్పాలి.
ఇక నేటి తరం కథానాయికల్లో సావిత్రి బయోపిక్ లో నటించిన కీర్తి సురేష్ ని కొంతమేర పోల్చుకోవచ్చు. ఆమె పాత్రలో నటించిన కీర్తి మంచి నటనతో ఆకట్టుకుంది. అయినప్పటికీ, కొందరు సావిత్రి డైహార్ట్ ఫ్యాన్స్ కీర్తిని నెగిటివ్ గా ట్రోల్ చేశారు. కొన్నిరోజుల పాటు ఈ ట్రోల్స్ కంటిన్యూ అయ్యాయి. అయితే, మళ్ళీ ఇప్పుడు యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే ని నెటిజన్స్, సావిత్రి అభిమానులు తెగ ట్రోల్ చేస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు.
రవితేజ, హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు తెరకి పరిచయమైంది భాగ్యశ్రీ బోర్సే. ఈ సినిమాపై భారీ అంచనాలుంటే..బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత కింగ్డం వస్తే, ఆ సినిమాలో హీరోయిన్ ఎవరో వెతుక్కోవాల్సి వచ్చింది. ఇక, ఇటీవల వచ్చిన ద్విభాషా చిత్రం కాంత కూడా నిరాశనే మిగిల్చింది. వాస్తవానికి ఇది బయోపిక్. రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రల్లో నటించారు.
ముందు నుంచి సినిమాపై పెద్దగా అంచనాలు లేవనే చెప్పాలి. అయితే, కాంత ప్రమోషన్స్ లో తన లుక్స్ అండ్ పర్ఫార్మెన్స్ సావిత్రిని గుర్తు చేస్తున్నట్టుగా జర్నలిస్టులు చెప్పారని భాగ్యశ్రీ చెప్పుకొచ్చింది. ఇలా చెప్పడం, ఆ మహానటితో నన్ను పోల్చడం చాలా సంతోషంగా ఉందని మాట్లాడింది. దీంతో నీకు సావిత్రితో పోల్చుకునేంత ఉందా..? అంటూ భాగ్యశ్రీని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
ట్రోలింగ్ విషయం పక్కన పెడితే, భాగ్యశ్రీ ఎంతమాత్రం సావిత్రి తో పోల్చుకోవడం సబబు కాదు అని చెప్పాలి. కాగా, రామ్ పోతినేని హీరోగా కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో నటించిన సినిమా ఆంధ్రాకింగ్ తాలూకా. పి.మహేష్ బాబు దర్శకత్వం వహించాడు. ఈ నవంబర్ 27న రిలీజ్ కాబోతోంది. చూడాలి, మరి ఈ సినిమాతోనైనా భాగ్యశ్రీకి హిట్ దక్కుతుందేమో.
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
Spirit Movie Release Date: స్పిరిట్ రిలీజ్ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగ..కానీ, ఆ విషయం మర్చిపోయాడా? అవును..తాజాగా ఈ…
MSG: మన శంకరవరప్రసాద్ గారు 4 రోజుల్లో మెగా రికార్డ్ సాధించారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ సినిమా కేవలం…
This website uses cookies.