Chiranjeevi: చిరంజీవికి అనిల్ రావిపూడి హిట్ ఇస్తాడా?

Chiranjeevi: చిరంజీవికి అనిల్ రావిపూడి హిట్ ఇస్తాడా?..ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే టాక్ మొదలైంది. ఇప్పటి వరకూ దర్శకుడు అనిల్ రావిపూడి ఫ్లాప్ ఎలా ఉంటుందో చూడలేదు. పటాస్ సినిమా నుంచి గత చిత్రం సంక్రాంతికి వస్తున్నాం వరకూ అన్నీ బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచినవే. ముఖ్యంగా వెంకటేష్‌కి హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చాడు అనిల్ రావిపూడి. వెంకీతో ఉన్న సక్సెస్ ట్రాక్ మాత్రమే కాదు, అనిల్ రావిపూడి సినిమాలను చూసి చిరు ఛాన్స్ ఇచ్చాడు.

చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత ఆశించిన విజయాలేవీ దక్కడం లేదు. ఖైదీ నంబర్ 150, వాల్తేరు వీరయ్య మాత్రమే చిరు నుంచి వచ్చిన సినిమాల్లో హిట్ సాధించాయి. దాంతో, మెగాస్టార్‌తో సినిమా చేసిన దర్శకులు ఫ్లాప్‌ని చూశారు. అయితే, చిరంజీవితో సినిమా చేస్తున్న అనిల్ రావిపూడి హిట్ ఇస్తాడా? అనే సందేహాలు మొదలయ్యాయి. దీనికి కారణం లేకపోలేదు.

will-anil-ravipudi-give-chiranjeevi-a-hit

Chiranjeevi: మన శంకరవరప్రసాద్ గారు సినిమా ఎలా ఉండబోతుంది 

అనిల్ రావిపూడి సినిమాలు కొంత ఆడియన్స్‌కి రొటీన్ అనే ఫీలింగ్ వచ్చింది. అదే కామెడీ..అలాంటి కథలే..అనే మాట వినిపిస్తోంది. బాలకృష్ణకి భగవంత్ కేసరి సినిమాతో హిట్ ఇవ్వడమే కాదు, ఈ సినిమా కథ, మేకింగ్ పరంగా అనిల్ రావిపూడి మార్క్ కాకుండా బాలయ్య మార్క్ అండ్ ఇమేజ్ కనిపిస్తుంది. అలాంటి కథలు గనక అనిల్ రావిపూడి చేస్తే ఇంకొన్నేళ్ళపాటు సక్సెస్‌లతో సాగుతాడు.

ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటుంది..మెగాస్టార్‌తో చేస్తున్న మన శంకరవరప్రసాద్ గారు సినిమా ఎలా ఉండబోతుంది అని. రొటీన్ గా ఏమాత్రం అనిపించినా ఫలితం గ్యారెంటీగా ఆశించిన విధంగా రాకపోవచ్చు. మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు, అందరూ ఈ సినిమా సక్సెస్ గురించే ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా, సంక్రాంతి సీజన్‌లో వస్తోన్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డ్స్‌ని క్రియేట్ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

2 weeks ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

2 weeks ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

4 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

1 month ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

1 month ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.