Prabhas-Spirit: ప్రభాస్ ‘స్పిరిట్’ కి క్లాప్ కొట్టిన మెగాస్టార్

Prabhas-Spirit: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటించబోతున్న సూపర్ కాప్ స్టోరీ స్పిరిట్ కి క్లాప్ కొట్టారు మెగాస్టార్ చిరంజీవి. సందీప్ రెడ్డి వంగ ఆఫీసులో ఈ సినిమా ముహూర్తం జరుపుకుంది. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, అనిమల్ చిత్రాలతో దేశ వ్యాప్తంగా పాపులర్ అయ్యాడు సందీప్ రెడ్డి వంగ. అనిమల్ తర్వాత ప్రభాస్ తో చేయనున్న స్పిరిట్ సినిమాకి సంబందించిన పనులను పూర్తి చేస్తూ వచ్చాడు. ఇప్పటికే, దాదాపు మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా కంప్లీట్ అయ్యాయి.

దాదాపు స్పిరిట్ సినిమా షూటింగ్ బీజీఎం తోనే జరిగేలా ప్లాన్ చేసుకున్నాడు సందీప్ రెడ్డి వంగ. ఇక ఈ సినిమాలో ప్రభాస్ కి జంటగా అనిమల్ సినిమాలో ఓ కీ రోల్ చేసిన త్రిప్తి డిమ్రీ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి దీపిక పడుకొణె ని ముందు ప్రకటించిన సందీప్ రెడ్డి వంగ, కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఆమెని పక్కన పెట్టి తన స్థానంలో త్రిప్తిని తీసుకున్నాడు. ఇక, గత కొన్ని రోజులుగా స్పిరిట్ సినిమాలో ప్రభాస్ కి తండ్రిగా మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్నట్టుగా వార్తలు వచ్చి వైరల్ అవుతున్నాయి.

prabhas-spirit-clapped-by-megastar

Prabhas-Spirit: ఓపెనింగ్ మాత్రం జరిగిపోయింది.

ఈ విషయంలో నిజం ఎంత ఉందో తెలియదు గానీ, తాజాగా జరిగిన స్పిరిట్ మూవీ ఓపెనింగ్ కి మాత్రం చిరంజీవి హాజరై క్లాప్ కొట్టడం ఇండస్ట్రీలో.. అలాగే, ప్రభాస్ ఫ్యాన్స్ లో హాట్ టాపిక్ అయింది. బాలీవు స్టార్ ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్ కూడా చిరుతో కలిసి క్లాప్ కొట్టాడు. మొత్తానికి, ఎన్నో నెలల నుంచి ఎదురుచూస్తున్న స్పిరిట్ సినిమా ఓపెనింగ్ మాత్రం జరిగిపోయింది. ఇక, ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడనేది సందీప్ రెడ్డి వంగ ఇంకా వెల్లడించలేదు.

కాగా, ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో చేస్తున్న ది రాజాసాబ్ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నారు. ప్రమోషన్స్ కూడా మొదలయ్యాయి. ఈ సినిమాతో పాటుగా హను రాఘవపూడి దర్శకత్వంలో చేస్తున్న ఫౌజీ సినిమా కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ క్రమంలో స్పిరిట్ పట్టలెక్కబోతోంది. ఇక, ఈ సినిమా తర్వాత కల్కి సీక్వెల్, సలార్ సీక్వెల్ చేయాల్సి ఉంది. ఇవి కాకుండా డార్లింగ్ మరికొన్ని భారీ ప్రాజెక్ట్స్ ని లైనప్ చేసుకున్నట్టుగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

1 day ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

3 days ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

3 days ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

7 days ago

Lord Shiva: కోరిన కోరికలు తీరడం లేదా.. శివాలయంలో ఈ పరిహారం చేస్తే చాలు!

Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…

7 days ago

Climbing Stairs: మెట్లు ఎక్కుతూ అలసిపోతున్నారా? ఫిట్ నెస్ లోపం అనుకుంటే పొరపాటే?

Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…

1 week ago

This website uses cookies.