Tue. Feb 3rd, 2026

    Bhagyashri Borse: మహానటితో పోల్చుకునేంత ఉందా..? అంటూ యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే గురించి నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో తప్పులేదనే చెప్పాలి. ఒకప్పటి అగ్ర తార అయిన సావిత్రి మహానటిగా దేశ వ్యాప్తంగా ఎలాంటి ఖ్యాతిని సంపాదించుకున్నదో అందరికీ తెలిసిందే. అలాంటి మహానటితో మరో హీరోయిన్ ని ఎట్టి పరిస్థితుల్లోనూ పోల్చడం సరికాదు..అలా పోల్చిన వారికీ తగిన అర్హత ఉండాలి. చెప్పాలంటే అలాంటి హీరోయిన్ ఒక జనరేషన్ లో సౌందర్య మాత్రమే అని చెప్పాలి.

    ఇక నేటి తరం కథానాయికల్లో సావిత్రి బయోపిక్ లో నటించిన కీర్తి సురేష్ ని కొంతమేర పోల్చుకోవచ్చు. ఆమె పాత్రలో నటించిన కీర్తి మంచి నటనతో ఆకట్టుకుంది. అయినప్పటికీ, కొందరు సావిత్రి డైహార్ట్ ఫ్యాన్స్ కీర్తిని నెగిటివ్ గా ట్రోల్ చేశారు. కొన్నిరోజుల పాటు ఈ ట్రోల్స్ కంటిన్యూ అయ్యాయి. అయితే, మళ్ళీ ఇప్పుడు యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే ని నెటిజన్స్, సావిత్రి అభిమానులు తెగ ట్రోల్ చేస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు.

    bhagyashri-borse-never-compai-with-savitri
    bhagyashri-borse-never-compai-with-savitri

    Bhagyashri Borse: మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు తెరకి పరిచయమైంది..

    రవితేజ, హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు తెరకి పరిచయమైంది భాగ్యశ్రీ బోర్సే. ఈ సినిమాపై భారీ అంచనాలుంటే..బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత కింగ్డం వస్తే, ఆ సినిమాలో హీరోయిన్ ఎవరో వెతుక్కోవాల్సి వచ్చింది. ఇక, ఇటీవల వచ్చిన ద్విభాషా చిత్రం కాంత కూడా నిరాశనే మిగిల్చింది. వాస్తవానికి ఇది బయోపిక్. రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రల్లో నటించారు.

    ముందు నుంచి సినిమాపై పెద్దగా అంచనాలు లేవనే చెప్పాలి. అయితే, కాంత ప్రమోషన్స్ లో తన లుక్స్ అండ్ పర్ఫార్మెన్స్ సావిత్రిని గుర్తు చేస్తున్నట్టుగా జర్నలిస్టులు చెప్పారని భాగ్యశ్రీ చెప్పుకొచ్చింది. ఇలా చెప్పడం, ఆ మహానటితో నన్ను పోల్చడం చాలా సంతోషంగా ఉందని మాట్లాడింది. దీంతో నీకు సావిత్రితో పోల్చుకునేంత ఉందా..? అంటూ భాగ్యశ్రీని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

    ట్రోలింగ్ విషయం పక్కన పెడితే, భాగ్యశ్రీ ఎంతమాత్రం సావిత్రి తో పోల్చుకోవడం సబబు కాదు అని చెప్పాలి. కాగా, రామ్ పోతినేని హీరోగా కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో నటించిన సినిమా ఆంధ్రాకింగ్ తాలూకా. పి.మహేష్ బాబు దర్శకత్వం వహించాడు. ఈ నవంబర్ 27న రిలీజ్ కాబోతోంది. చూడాలి, మరి ఈ సినిమాతోనైనా భాగ్యశ్రీకి హిట్ దక్కుతుందేమో.

     

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.