Health: ఈ రోజుల్లో అందరి ఆహారపు అలవాట్లు, జీవన విధానాల్లో ఎప్పటికప్పుడు మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు వారానికి ఒకసారి కూడా మాంసాహారం తినడం అనేది చాలా అరుదుగా ఉండేది. గ్రామీణ ప్రాంతాల్లో శుభకార్యాలు, ఫెస్టివల్స్ జరిగే సమయంలో మాత్రమే మాంసాహారం ఎక్కువగా తినేవారు. అయితే ప్రస్తుతం సొసైటీలో మాంసాహార ప్రియులు ఎక్కువైపోయారు. ప్రతిరోజు మాంసం తినే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ కారణంగానే నాన్వెజ్ ధరలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. అలాగే నాన్ వెజ్ తినే వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో కోళ్ళను కూడా కృత్రిమంగా మందులు ఇచ్చి త్వరగా పెరిగేలా చేస్తున్నారు.
ఇలా కృత్రిమ ఉత్పత్తితో పెంచుతున్న కోళ్ళను తినడం వలన ఎలాంటి పౌష్టిక శక్తి కూడా దొరకడం లేదు సరికదా కొత్త కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి. ఇక మార్కెట్లో రెస్టారెంట్లు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ రెస్టారెంట్ లో మాంసాహారంతో చాలా రకాల వంటలు సిద్ధం చేసి భోజన ప్రియులను ఆకర్షిస్తున్నారు. అయితే కొంతమంది మిగిలిపోయిన మాంసాన్ని ఫ్రిజ్ లో నిల్వ ఉంచి మరల దానిని మరుసటి రోజు లేదంటే రెండు మూడు రోజుల తర్వాత వరకు ఉపయోగిస్తున్నారు. ఇలాంటి మాంసాలతో రకరకాల వ్యాధులు సంక్రమిస్తున్నాయి. ఈ కారణంగానే నిల్వ ఉన్న మాంసకృత్తులను ఆహారంగా తీసుకోవద్దని డాక్టర్లు కూడా సూచిస్తున్నారు.
అలాగే అప్పుడప్పుడు ఆహార నాణ్యత అధికారులు కూడా హోటల్స్ పై రైడ్ చేస్తూ నిల్వ ఉన్న ఆహార పదార్థాలను పట్టుకుని సీజ్ చేస్తున్నారు. అయితే చాలామంది మాంసాన్ని ఫ్రిజ్లో నిల్వ చేయడం మాత్రం మానడం లేదు. ఇళ్లల్లో కూడా చాలామంది ప్రజలు మాంసాన్ని అన్ని ఫ్రిజ్లో నిల్వ ఉంచుకొని రెండు మూడు రోజులపాటు తింటారు. ఇది మంచి పద్ధతి కాదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఫ్రిజ్ లో నిల్వ ఉన్న కూడా మాంసం త్వరగా పాడైపోతుందని, దీన్ని గుర్తించడం కూడా చాలా సులభం అని చెప్తున్నారు.
పాడైన చికెన్ నుంచి వేరే రకమైన దుర్వాసన వస్తుందని చెబుతున్నారు. సుగంధ ద్రవ్యాలను ఉపయోగించి మాంసంతో చేసిన కూడా చెడిపోయే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే మాంసం రంగు కూడా మారిపోతుంది. బూడిద, ఆకుపచ్చ రంగులో మాంసం కనిపిస్తే అది పాడైపోయిందని గుర్తించాలని చెబుతున్నారు. అలాంటి ఆహారాన్ని తీసుకుంటే ఖచ్చితంగా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని కూడా హెచ్చరిస్తున్నారు. పాడైన మాంసాన్ని తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యి వాంతులు, తల తిరగడం ఇలాంటి సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు. ఇలాంటి సమస్యలు వస్తే వెంటనే డాక్టరును సంప్రదించాలని కూడా సూచిస్తున్నారు. మరి ఇప్పటినుంచైనా నిల్వ ఉన్న మాంస పదార్థాలను వీలైనంత వరకు తినడం తగ్గించుకునే ప్రయత్నం చేస్తే మంచిదని ఆరోగ్య నిపుణుల మాట.