Rudraksha: మన హిందూ సంప్రదాయాల ప్రకారం రుద్రాక్షలకు ఎంతో మంచి ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉందని చెప్పాలి. దైవ పరంగా రుద్రాక్షలను ఎంతో పవిత్రమైనవిగా భావిస్తూ ఉంటారు అందుకే రుద్రాక్షను ధరించడం వల్ల మంచి జరుగుతుందని ప్రతి ఒక్కరు భావిస్తూ ఉంటారు. అయితే రుద్రాక్షలను ధరించడం వల్ల మంచి జరుగుతుందని ఎలా పడితే అలా ధరించడం మంచిది కాదు కొన్ని నియమాలను పాటిస్తూ రుద్రాక్షలను ధరించడం వల్ల ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. మరి రుద్రాక్ష మాలను ధరించేటప్పుడు ఎలాంటి నియమాలను పాటించాలి అనే విషయానికి వస్తే…
ఆ శివయ్య అనుగ్రహం కోసం చాలామంది రుద్రాక్ష మాలను ధరిస్తూ ఉంటారు అయితే ఈ రుద్రాక్షలు ధరించడానికి శ్రావణమాసం ఎంతో మంచి నెల అని చెప్పాలి.ఆగష్టు 5వ తేదీ 2024, సోమవారం నుంచి ప్రారంభమవుతుంది. రుద్రాక్ష ధరించడానికి శ్రావణ మాసం ఉత్తమం అని చెప్పాలి. శుక్ల పక్షంలో సోమవారం రుద్రాక్షను ధరించడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. రుద్రాక్షను ధరించే ముందు, దీనిని శుద్ధి చేసి పవిత్రం చేయడం అవసరం.
ఈ రుద్రాక్షను శుభ్రం చేయటం కోసం ఒక గిన్నెలో 1 స్పూన్ పెరుగు, తేనె, గంగాజలం, తులసి దళం, నెయ్యి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పంచామృతాలున్న గిన్నెలో రుద్రాక్షను వేసి కొన్ని నిమిషాల పాటు అలాగే ఉంచాలి. 10 నిమిషాల తర్వాత రుద్రాక్షలను తీసి గంగాజలంతో శుభ్రం చేయాలి.ఇప్పుడు శివుని మంత్రాలతో రుద్రాక్షను పూజించాలి.ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా రుద్రాక్షను శుద్ధి చేసిన తర్వాత ధరించడం ఎంతో మంచిది.