Health: ప్రస్తుతం మన జీవ శైలిలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పెరుగుతున్న జనాభా కారణంగా ప్రతీది ఖరీదైపోతోంది. ఇలాంటి సమయంలో సంపాదన సరిపోక పని వేళలు (వర్కింగ్ అవర్స్) ఎక్కువగా పెంచుకోవాల్సి వస్తోంది. దీనివల్ల ఆహారం స్వయంగా తయారు చేసుకునేందుకు సమయం కేటాయించలేక ఎక్కువగా స్విగీ, జొమాటో లాంటి వాటి మీద ఆధారపడి హోటల్ ఫుడ్‌కు అలవాటు పడుతున్నారు. అంతేకాదు. ఇంట్లో కావలసినవన్నీ ఒకేసారి కొనేసి ఫ్రిడ్జ్‌లలో నిలువ ఉంచి వాటినే తరచుగా ఉపయోగిస్తున్నాము. దీనివల్ల మనకు తెలియకుండా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇక మన ఆరోగ్యం బావుండాలంటే..ఏ ఆహారానికి బదులు ఏది తీసుకోవాలి..ఇలా ఒకదానికి బదులు మరొకటి తీసుకోవడం వల్ల కలిగే లాభాలేమిటో చూద్దాం..
మనలో చాలామంది బటర్‌ను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇది మంచిదే. కానీ, బటర్‌లో రెండు రకాలున్నాయి. దేన్ని ఉపయోగిస్తే మంచిదో చాలామందికి అంతగా అవగాహన ఉండదు. బటర్‌లో యానిమల్ బటర్, ప్లాంట్ బటర్ అని రెండు రకాలుంటాయి. యానిమల్ బటర్ అంటే ఆవు, గేదే నుంచి తయారు చేసేది. ప్లాంట్ బటర్ అంటే ప్రకృతి నుంచి తయారయ్యేది. మనలో ఎక్కువగా యానిమల్ బటర్‌నే ఉపయోగిస్తుంటారు.
Health: అన్ని ఫ్రూట్స్ కంటే అత్యంత బలమైన ఫ్రూట్ ఈ అవకాడో.
ఇది ఒకేసారి ఎక్కువగా కొనేసి ఫ్రిడ్జ్‌లో దాచి కూరల్లో వాడుతుంటారు. అయితే, ఇలా వాడటం అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దీనికి బదులు ప్లాంట్ బటర్ అంటే ఫ్రూట్ బటర్. దీనిని పండ్ల ద్వారా తయారు చేస్తారు. మార్కెట్లో ఫ్రూట్ బటర్ లేదా అవకాడో అనే పేరుతో లభిస్తుంది. ఈ బటర్ పూర్వం ఇతర దేశాల లో మాత్రమే లభించేది. ప్రస్తుతం మన దేశంలోనూ లభిస్తోంది. ఫ్రూట్ బటర్‌ను అవకాడో బటర్ అని ఇందులో వెన్నలాంటి గుజ్జు ఉంటుందని కొంతమందికి తెలియదు. ఏ ఫ్రూట్‌కు లేని విశేషత ఈ బటర్ ఫ్రూట్‌కు ఉంది.
అన్ని ఫ్రూట్స్ కంటే అత్యంత బలమైన ఫ్రూట్ ఈ అవకాడో. పండ్లలో అధిక శక్తినిచ్చేది అరటి పండు. 116 కేలరీలు ఇందులో ఉంటే 100 గ్రాముల అవకాడో ఫ్రూట్ తీసుకుంటే 215 గ్రాముల కేలరీలు లభిస్తాయి. అంటే మరే ఫ్రూట్‌కు లేని అధిక కేలరీలు ఇందులో లభిస్తాయి. ఆఖరికి ఖర్జూర పండులో కూడా అవకాడో కంటే తక్కువ కేలరీలు ఉంటాయి. ఇందులో 144 కేలరీలే ఉంటాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషన్ వారు తెలిపిన దాని ప్రకారమే ఈ లెక్కలున్నాయి. అందుకే, యానిమల్ బటర్ కంటే ఎక్కువగా ఫ్రూట్ బటర్ (ప్లాంట్ బటర్)ను ఉపయోగించడం అన్నిటికంటే ఉత్తమం. అధిక బరువు ఉన్నవారు, షుగర్ లెవల్స్ పెరగకుండా ఉండేందుకు ఈ అవకాడో ఫ్రూట్ ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇందులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగానూ లభిస్తాయి.