Spiritual: సనాతన హిందూ సాంప్రదాయంలో ఎన్నో ఆచార వ్యవహారాలు అనాదిగా భారతీయ నాగరికతలో భాగంగా ఉన్నాయి. ప్రకృతిలో ప్రతి వస్తువు పుట్టుక వెనుక ఒక ఆధ్యాత్మిక సంబంధమైన కారణాలు ఉంటాయి. వాటి వినియోగంలో దైవత్వాన్ని సమీపంలో ఉంచుకోవడం, దైవాన్ని చేరుకోవడం సాధ్యమవుతుందని విషయాన్ని ఒకప్పటి మహర్షులు, ఆధ్యాత్మిక తత్వవేత్తలు గ్రంధాలలో, పురాణ ఇతిహాసాలలో తెలియజేశారు. అయితే మారుతున్న కాలంతో పాటు నాగరిక మూలాలను కూడా మరిచిపోయిన పరిస్థితి వచ్చింది. అయితే ఈ భౌతిక పరమైన జగత్తులో ఆధ్యాత్మిక సంబంధమైన మార్గాలను అనుసరించడం, భగవంతునితో మనల్ని అనుసంధానించే ప్రకృతి మూలాలను మనతోపాటు ఉంచుకోవడం ఎంతో శ్రేష్టమని ఆధ్యాత్మికవేత్తలు చెబుతూ ఉంటారు.
అలాంటి వాటిలో శంఖం ఒకటి. దీని ప్రాధాన్యత భారతీయ పురాణ ఇతిహాసాలలో కూడా ఉంది. సముద్ర గర్భంలో దొరికే ఈ శంఖానికి భగవంతునితో అనుబంధం ఉంది. క్షీరసాగర మదనంలో శంఖం ముందు పుట్టి తర్వాత లక్ష్మీదేవి ఉద్భవించిందని ఆధ్యాత్మిక గ్రంథాలలో చెప్పబడింది. శంఖం నుంచి ఓంకార శబ్దం వెలువడుతుందని అందరికీ తెలిసిందే. అందుకే మన హిందుత్వ ఆధ్యాత్మిక మార్గంలో శంఖంకి ప్రత్యేక స్థానం ఉంది. యుద్ధం ఆరంభం సమయంలో శంఖాన్ని పూరించడం శుభసూచకంగా భావిస్తారు. ఆ శంఖం గెలుపుని అందిస్తుందని భావన. వాస్తు శాస్త్రాన్ని నమ్మేవారు శంఖం యొక్క గొప్పతనం తెలుసుకుంటారు.
ఇంట్లో శంఖం శబ్దాన్ని పూరిస్తే మంచి జరుగుతుందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతుంటారు. రోజుకు నాలుగు సార్లు సంఖం ఊదిన వాళ్ళ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందని ఆధ్యాత్మిక గురువులు కూడా తెలియజేశారు. ఇంట్లో శంఖం పెట్టుకొని పూజిస్తే ప్రతికూల వాతావరణం పూర్తిగా మాయం అవుతుంది. శంఖంకి ఉండే ఆధ్యాత్మిక శక్తి కారణంగా ఏ ఇంట్లో ఇది ఉంటుందో ఆ ఇంట్లో ఎలాంటి గొడవలు జరగవని ఆధ్యాత్మిక గురువులు చెబుతూ ఉంటారు. అలాగే వాస్తు దోషాలు ఉన్నా కూడా అవి తొలగిపోతాయని చెబుతున్నారు.
శంఖం ఏ ఇంట్లో అయితే పెట్టుకుని పూజిస్తారు ఆ ఇంట్లో సుఖ సంతోషాలతో పాటు లక్ష్మీదేవి కూడా కొలువై ఉంటుందని పండితులు చెప్పే మాట. అలాగే శంఖం నుంచి ఉద్భవించే ఓంకార నాదాన్ని ప్రతిరోజు వినడం ద్వారా మానసిక ప్రశాంతత కూడా పెరుగుతుందని ఆధ్యాత్మిక గురువులు చెబుతున్నారు. సముద్రంలో ఉద్భవించే ఈ శంఖానికి దైవ శక్తిని చేసే లక్షణం ఉండడంతో ఇది గొప్ప శక్తివంతమైన వస్తువుగా ఆధ్యాత్మిక గ్రంథాలలో చెప్పబడింది.