Hot Water: మనం ప్రతిరోజు ఎక్కువ మోతాదులో నీటిని తీసుకోవడం మన ఆరోగ్యానికి మంచిదని భావిస్తూ ఉంటాము. ఇలా నీటిని అధికంగా తీసుకోవడం వల్ల మన శరీరంలో జరిగే జీవక్రియలు సక్రమంగా జరుగుతాయని భావిస్తూ ఉంటారు. అయితే కాలానికి అనుగుణంగా కొంతమంది వేడి నీళ్లు మరికొందరు చల్ల నీళ్లు తాగుతూ ఉంటారు అయితే చలికాలంలో గోరువెచ్చని నీరు తాగడం వల్ల ఏ విధమైనటువంటి ఫ్లూ ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయని భావిస్తూ ఉంటారు.
అయితే మనం ప్రతిరోజు గోరువెచ్చని నీటిని తాగటం వల్ల ఏ విధమైనటువంటి ప్రమాదం తలెత్తుతుందా అనే సందేహాలు కూడా చాలామందికి కలుగుతూ ఉంటాయి. అయితే తరచూ వేడి నీటిని తాగటం వల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి అసలు తాగడం మంచిదేనా అనే విషయానికి వస్తే.. ప్రతిరోజు మనం గోరువెచ్చని నీటిని తాగడం వల్ల ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇలా హాట్ వాటర్ తాగటం వల్ల మన శరీరంలో నరాల పనితీరు మెరుగు పడటమే కాకుండా రక్తప్రసరణ వ్యవస్థలో ఏ విధమైనటువంటి సమస్యలు తలెత్తవని చెబుతున్నారు. అలాగే మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ మొత్తం కరిగిపోతుంది. ఇక జీర్ణ క్రియ సమస్యలు కూడా తలెత్తవు అలాగే దగ్గు జలుబు కంటి సమస్యలతో బాధపడే వారికి ఇదొక చక్కటి హోం రెమిడి అని చెప్పవచ్చు. ఇలా ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాకుండా చర్మ సౌందర్యాన్ని కూడా పెంపొందించుకోవచ్చు తరచు గోరువెచ్చని నీటిని తాగటం వల్ల మొఖంపై ఏర్పడిన మచ్చలు మొటిమలు కూడా తగ్గిపోతాయి. ఇలా ఆరోగ్యానికి మంచిది కదా అని బాగా వేడిగా ఉన్న నీటిని తాగితే ప్రమాదాలు ఏర్పడతాయి కనుక గోరువెచ్చని నీరు తాగటం మంచిది.