Health: మారుతున్న కాలానికి అనుగుణంగా మనిషి ఆహార అలవాట్లు మారాయి. ఫాస్ట్ ఫుడ్ లకి ఇచ్చే ప్రయారిటీ పెరిగిపోయింది. ఆకుకూరలు , కూరగాయల్లో ఆరోగ్యం ఉందని తెలిసినా వాటిని తీసుకోవడానికి ఇష్టపడరు చాలా వరకు కూరగాయలు ఆకుకూరలు చాలా మంది తినరు. అయితే కొన్ని కూరగాయలో ఉన్న పోషకాల విలువలను బట్టి వాటిని వండే తినాల్సిన అవసరం లేదు జ్యూస్ లాగాను తీసుకోవచ్చు. నిజానికి రెగ్యులర్ డైట్ కు జ్యూసులు అధనంగా పోషకాలను అందిస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. చక్కెరతో చేసే జ్యూస్ లే కాదు, వితౌట్ షుగర్ టేస్టీగా ఉండే జ్యూస్ క్యారెట్ జ్యూస్. ప్రతి రోజు క్యారట్ జ్యూస్ తాగడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.
క్యారెట్ జ్యూస్ లో ఆన్ని పోషకాలు ఉన్నాయా? : క్యారట్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. క్యారెట్ జ్యూస్ కూడా అదే చేస్తుంది. ఒక్క ఎనిమిది ఔన్సుల క్యారెట్ జ్యూస్ మీ శరీరానికి పొటాషియం, విటమిన్లు సి , కె లని అందిస్తుంది. 255 శాతం విటమిన్ ఏ ను ఒక గ్లాసు క్యారట్ జ్యూస్ నుంచి ప్రతి రోజూ పొందవచ్చు. క్యారెట్ జ్యూస్‌లో లుటిన్ జియాక్సంతిన్ తో పాటు కెరోటినాయిడ్స్ అయిన ఇన్ఫ్లమేటరీ , యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి.
క్యారెట్ జ్యూస్ తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? :
క్యారెట్ జ్యూస్ తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వ్యాధులతో పోరాడే రోగ నిరోధక శక్తి అధికంగా ఉండే ఆహారం ఇది. కంటి ఆరోగ్యాన్ని కాపాడడంలో క్యారెట్ జ్యూస్ ఎంత మెరుగ్గా పనిచేస్తుంది. ల్యూటీన్, జియాక్సంతిన్, బీటా కెరోటిన్ విటమిన్ సి లు వయసు పెరుగుతున్నా కొద్ది వచ్చే కంటి ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది.
చర్మ ఆరోగ్యానికి విటమిన్ సి ఎంతగానో తోడ్పడుతుంది. ఇది క్యారెట్ జ్యూస్ లో పుష్కలంగా ఉంది. పరిశోధకుల అధ్యయనాల ప్రకారం యాంటీఆక్సిడెంట్ శరీరం యొక్క కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది అంతే కాదు UV- సంబంధిత నష్టం నుండి కూడా చర్మాన్ని రక్షించవచ్చు. మీ స్కిన్ గ్లోని పెంచుకోవడానికి ఖరీదైన క్రీములను వాడక్కర్లేదు దానికి బదులుగా ప్రతిరోజూ క్యారెట్ జ్యూస్ లు తాగడం వల్ల ఎంతో మెరుగైన ప్రకాశవంతమైన చర్మాన్ని పొందవచ్చు.
2013 లో BMJలో ప్రచురించబడిన ఓ సమీక్ష ప్రకారం, హార్ట్ స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడంలో తగినంత మోతాదులో శరీరానికి అందించడంలో పొటాషియం ప్రధాన పాత్ర పోషిస్తుంది. అందుకే పొటాషియం కలిగిన క్యారెట్ తో జ్యూస్ చేసుకుని ఒక గ్లాస్ ప్రతిరోజు తాగితే మీ హృదయాన్ని కాపాడుకోవచ్చు. మ్యాట్రిక్స్ బయాలజీలో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం, క్యారెట్ లో ఉండే విటమిన్ సి, కెరోటిన్‌లు దంతాల ఎనామెల్‌ను బలోపేతం చేయడంతో పాటు, వాటి రక్షణ కు సహాయపడతాయి.
క్యారెట్ రసం క్యాన్సర్ వ్యతిరేక ప్రభావాన్ని కలిగి ఉంది. యాంటీ క్యాన్సర్ ఏజెంట్స్ ఇన్ మెడిసినల్ కెమిస్ట్రీలో ప్రచురించబడిన ఒక అధ్యయనంలో, లుటీన్ , బీటా కెరోటిన్ లు లుకేమియా కణాలను చంపేస్తాయని కనుగొనబడింది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.