Saffron: కుంకుమపువ్వు లో ఉన్న ఔషధ గుణాలు మనలో అనేక అనారోగ్య సమస్యలను దూరం చేయడంతో పాటు అవయవాల పనితీరును మెరుగుపరుస్తుంది. పురాతన ఆయుర్వేద గ్రంధాల్లో కుంకుమపువ్వు విశిష్టతను చక్కగా వర్ణించారు. కుంకుమపువ్వు కొంత ఖరీదైనప్పటికీ దీన్ని మన ఆహారంలో తీసుకుంటే అనేక మొండి వ్యాధులను సైతం నయం చేసి తక్షణ ఫలితాన్ని ఇస్తుంది.ముఖ్యంగా గర్భిణీ స్త్రీలలో తలెత్తే అనేక సమస్యలను దూరం చేయడంలో కుంకుమపువ్వు కీలక పాత్ర పోషిస్తుందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
గర్భిణీ మహిళలు ఎక్కువమంది ఎదుర్కొనే ప్రధాన సమస్య రక్తహీనత. ఈ సమస్య తల్లి బిడ్డల ఆరోగ్యం పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ సమస్య నుంచి బయటపడడానికి ప్రతిరోజు గోరువెచ్చని పాలల్లో కుంకుమపువ్వు వేసుకొని సేవిస్తే రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరిగి ప్రమాదకర రక్తహీన సమస్యను దూరం చేస్తుంది. గర్భధారణ సమయంలో మహిళలు ఎదుర్కొనే వాంతులు, వికారం, మైకం వంటి సమస్యలను తగ్గించడంలో కుంకుమ పువ్వులోని ఔషధ గుణాలు చక్కగా ఉపయోగపడతాయి.
గర్భిణీ స్త్రీలు అధిక ఒత్తిడి కారణంగా రక్తపోటు సమస్య ఎదురవుతుంది. రక్తపోటు సమస్యను అదుపు చేయడానికి గోరువెచ్చని పాలల్లో కుంకుమపువ్వు కలుపుకొని సేవిస్తే రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడి హైబీపీ సమస్య కూడా అదుపులో ఉంటుంది. అలాగే జీర్ణ వ్యవస్థ మెరుగుపడి ఆకలి పెంచడంతోపాటు గ్యాస్టిక్, అజీర్తి ,మలబద్ధక సమస్యలను దూరం చేస్తుంది. కుంకుమపువ్వులో అధికంగా ఉన్న యాంటీఆక్సిడెంట్, పొటాషియం క్రోసెటిన్ అనే పదార్థం గుండె దడను తగ్గించి ఒత్తిడిని దూరం చేయడంతో పాటు నిద్రలేమి సమస్యను దూరం చేసే బిడ్డ కదలికకు కూడా ఎంతగానో దోహదపడుతుంది.