Beet Root Juice: చాలామంది ఎన్నో రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఇలా అనారోగ్య సమస్యలతో బాధపడే వారిలో రక్తహీనత సమస్య ఒకటి. రక్తహీనత సమస్య కారణంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటుంటారు. అయితే ఈ సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు ఉదయం పరగడుపున బీట్రూట్ రసం తాగితే చాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను మన సొంతం చేసుకోవడమే కాకుండా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
ముఖ్యంగా బీట్రూట్ లో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, ఫైబర్, విటమిన్ బి12, అమైనో ఆమ్లాలు, యాంటీ ఏజింగ్ గుణాలు సమృద్ధిగా లభిస్తాయి. కావున ప్రతిరోజు బీట్రూట్ రసాన్ని అల్పాహారం కంటే ముందే సేవిస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బీట్రూట్లో అత్యధికంగా లభించే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు శరీరంలో ఏర్పడే ఫ్రీ రాడికల్స్ నియంత్రించి మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంతోపాటు క్యాన్సర్ కణాల నియంత్రణలో అద్భుత ఔషధంగా పనిచేస్తుంది.బీట్ రూట్ జ్యూస్ ప్రతిరోజు సేవిస్తే శరీర దృఢత్వం పెరగడంతోపాటు మనలో అలసట, నీరసాన్ని తొలగించి శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది.
Beet Root Juice:
తరచూ మిమ్మల్ని వేధించే రక్తహీనత సమస్య నుంచి బయటపడాలంటే ప్రతిరోజు ఒక గ్లాసుడు బీట్రూట్ రసాన్ని సేవిస్తే ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి అవసరమయ్యే ఐరన్, ఫోలిక్ ఆమ్లం, విటమిన్ బి12 సమృద్ధిగా లభిస్తుంది.తలసేమియా వ్యాధికి కూడా చక్కని పరిష్కారం లభిస్తుంది. షుగర్ వ్యాధితో బాధపడేవారు బీట్రూట్ జ్యూస్ లోకి తేనె కలిపి తీసుకోవడం ఎంతో మంచిది. ఇక ఈ జ్యూస్ ప్రతిరోజు పరగడుపున తాగడం ఎంతో మంచిది.