Beauty Tips: అందం ఎవరి సొంతం కాదు అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అయితే కొందరికి శరీర బరువు కారణంగా శరీర సౌష్టవం కారణంగా అందవిహీనంగా కనిపిస్తూ ఉంటారు.అధిక శరీర బరువు కలిగినటువంటి వారి మెడ చుట్టూ నల్లటి ముడతలు ఏర్పడి ఉంటాయి ఇలా నల్లటి ముడతలు చాలా అందవిహీనంగా కనపడుతూ ఉంటాయి. అయితే ఈ సమస్య నుంచి బయటపడాలి అంటే ఈ సింపుల్ చిట్కాలను పాటిస్తే చాలు.
ఇలా చర్మంపై ముడతలు ఏర్పడడానికి పోషకాహార లోపం, వాతావరణ కారణాలు, ఆరోగ్య సమస్యలు ప్రధాన కారణాలుగా చెప్పొచ్చు. మెడ కింది భాగంలో ముడతలను తగ్గించుకోవడానికి టేబుల్ స్పూన్ అలివ్ నూనె తీసుకొని అందులో టేబుల్ స్పూన్ తేనె కొన్ని చుక్కల గ్లిజరిన్ కలిపి ఈ మిశ్రమాన్ని వారంలో ఒకటి లేదా రెండు సార్లు మెడకింది ముడతలపై మర్దన చేసుకుంటే చాలు ముడతలు తొలగిపోయి మెడ చుట్టూ భాగం ఎంతో అందంగా కనపడుతుంది.
Beauty Tips
విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉండే అరటిపండు చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది.ఇందుకోసం బాగా పండిన అరటిపండును మెత్తటి గుజ్జుగా మార్చుకొని చర్మంపై ఉండే మడతలపై మర్దన చేసుకుంటే చర్మంపై ఉండే మృత కణాలను తొలగించే కొల్లాజన్ ఉత్పత్తిని పెంపొందిస్తుంది. తద్వారా చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది. ఇలా ఈ సింపుల్ చిట్కాలతో సమస్యకు చెక్ పెట్టి ఎంతో అందంగా కనిపించవచ్చు.