Beauty Tips: అందంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు అయితే చాలామందికి మొహంపై చిన్న మచ్చలు మొటిమల సమస్యలతో బాధపడుతూ ఎంతో అందవిహీనంగా కనిపిస్తూ ఉంటారు. ఇలాంటివారు అందంగా కనిపించడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.ఇలా అందంగా కనిపించడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా పెద్దగా ఫలితం ఉండదు. అలాంటివారు ఈ సింపుల్ చిట్కాలను కనుక పాటిస్తే రెట్టింపు అందాన్ని సొంతం చేసుకోవచ్చు. మరి ఆ చిట్కాలు ఏంటి అనే విషయానికి వస్తే…
ముందుగా ఒక గిన్నెలో అరకప్పు ఎర్ర కందిపప్పు నానబెట్టి వాటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ ఎర్ర కందిపప్పు నుంచి కాస్త జ్యూస్ బయటకు తీసి అందులో టమోటా రసం పొటాటో రసం కలిపి దూది సహాయంతో మచ్చలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఈ జ్యూస్ అప్లై చేయాలి అనంతరం బాగా ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల మొహం పై ఉన్నటువంటి మచ్చలు తగ్గిపోయి. ఇలా రోజుకు రెండుసార్లు చేయడం వల్ల అందం మీ సొంతం అవుతుంది.
Beauty Tips:
అదేవిధంగా అర గ్లాస్ వాటర్ తీసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ వేసుకోవాలి.దీనిని ఒక స్ప్రే బాటిల్ లో నింపుకొని ఎక్కడైతే మచ్చలు ఉన్నాయో ఆ భాగంలో స్ప్రే చేయాలి ఇలా తరచూ చేస్తూ ఉండటం వల్ల కఠినమైన మొండి మచ్చలు సైతం తొలగిపోయి ఎంతో అందంగా కనపడతారు.ఇలా మొహం మొత్తం డ్రై అయిన తర్వాత శుభ్రమైన చల్లని నీటితో కడుక్కోవడం వల్ల మొఖం ఎంతో కాంతివంతంగా ఉండటమే కాకుండా మచ్చలు కూడా తొలగిపోతాయి.