Vastu Tips: మన హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం తులసి మొక్కను ఎంతో పవిత్రమైనదిగా భావిస్తాము తులసి మొక్కను పూజించడం వల్ల సాక్షాత్తు లక్ష్మీదేవిని పూజించినట్లేనని భావిస్తారు తులసి లక్ష్మీ స్వరూపంగా పరిగణిస్తారు. అందుకే ప్రతి ఒక్క ఇంటి ఆవరణంలోనూ తులసి మొక్కను పెట్టడం మనం చూస్తుంటాము. ఇలా తులసి మొక్కకు ప్రతిరోజు పూజ చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనపై కలుగుతుందని భావిస్తారు. అయితే మనకు ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆర్థిక అభివృద్ధి కలగాలి అంటే తులసి ఆకులతో ఈ చిన్న పరిహారం చేస్తే లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు మనపై ఉంటాయి.
తులసి ఆకులతో ఈ చిన్న పరిహారం చేయడం కోసం 11 తులసి ఆకులను తీసుకొని శుభ్రంగా కడగాలి.
పగటిపూట 11 పచ్చి తులసి ఆకులను ఎంచుకొని కడిగి ఎండలో ఆరబెట్టాలి. సింధూరంలో ఆవాల నూనె కలిపి తులసి ఆకులపై రామనామాన్ని రాయాలి. ఆ ఆకులతో మాల తయారుచేసి ఆంజనేయుడికి సమర్పించాలి. ఇలా ఆంజనేయుడుకి తులసిమాలను సమర్పించడం వల్ల ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు అనేవి ఉండవు.
ఇక జేబులో రూపాయి లేకుండా ఆర్థిక సమస్యలతో బాధపడేవారు తులసి ఆకులను ఎరుపు రంగు వస్త్రంలో కట్టి మీ పర్సు లేదా డబ్బులుంచే అల్మారాలో పెట్టాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ధన ప్రవాహం పెరిగి కుటుంబానికి ధన వర్షం కురుస్తుంది. మన ఇంట్లో ప్రతికూల శక్తి ఎక్కువగా ఉన్నట్లయితే ఐదు తులసి ఆకులను తీసుకొని ఒక ఇత్తడి గిన్నెలో నీటిని పోసి తులసి ఆకులను వేయడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి ప్రతికూల శక్తి మొత్తం తొలగిపోయి అనుకూల శక్తి ఏర్పడుతుంది. ఇలా ఇంటి మొత్తం పాజిటివ్ ఎనర్జీని కలిగించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తుంది.