Bandi Sanjay: తెలంగాణలో వరుసగా పరీక్ష పత్రాలు లీక్ అవడం ఒక్కసారిగా అభ్యర్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. టిఎస్పిఎస్సి లీకేజ్ విషయం తెలంగాణ ఒక్కసారిగా ఓ కుదుపు కుదిపిన విషయం మనకు తెలిసింది. అయితే ఈ ఘటన నుంచి మర్చిపోకముందే తెలంగాణలో జరుగుతున్నటువంటి పదవ తరగతి పరీక్ష పత్రాలు కూడా బయటకు రావడంతో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది.ఇలా టెన్త్ పరీక్ష పత్రాలు లీక్ అవడంతో విద్యా శాఖ మంత్రి దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేయగా ఈ లీకేజ్ విషయంలో బిజెపి స్టేట్ చీఫ్ బండి సంజయ్ హస్తం ఉందని తెలియడంతో పోలీసులు అరెస్టు చేశారు.
ఈ విషయం తెలంగాణలో ఒక్కసారిగా సంచలనంగా మారింది. పోలీసులు బండి సంజయ్ ను అరెస్టు చేయడంతో హై డ్రామ మొదలైంది. ఇక ఈయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత హనుమకొండ మెజిస్ట్రేట్ అనిత రాపోల్ ముందు బండి సంజయ్ ను పోలీసులు హాజరు పరిచారు. పోలీస్ రిమాండ్ రిపోర్ట్ పరిశీలించిన మేజిస్ట్రేట్ ఇరు వర్గాల వారి వాదన విన్న తర్వాత ఆయనని 14 రోజులపాటు రిమాండ్ కు తరలించాలని ఆదేశాలు ఇవ్వడంతో పోలీసులు తనని కరీంనగర్ జైలుకు తరలించారు.
Bandi Sanjay:
ఇకపోతే నేడు బిజెపి లీగల్ టీం హైకోర్టులో బండి సంజయ్ బెయిల్ కు పిటిషన్ దాఖలు చేశారు. ఇక పరీక్ష పత్రాలు లీకేజీ విషయంలో బండి సంజయ్ A1 గా పూర్ణ కారణంగా ఆయనని రిమాండ్ లోనే ఉంచి విచారణ చేపడితే ఈ విషయంలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు. అందుకే ఆయనకు బెయిల్ ఇవ్వకుండా కస్టడీ విధించాలని పోలీసులు కోరుతున్నారు. బండి సంజయ్ తరపు న్యాయవాదులు మాత్రం రిమాండ్ ను సవాల్ చేస్తూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేయనున్నారు.ఇలాంటి ఉద్రిక్తత పరిస్థితుల నడుమ కోర్టు బండి సంజయ్ కు బెయిల్ ఇస్తుందా లేకపోతే కష్టడికి అప్పగిస్తుందా అనే విషయం తెలియాల్సి ఉంది.