Balakrishna-Rashmika : రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న లవ్ లో ఉన్నారని లోకమంతా కోడై కూస్తోంది. సోషల్ మీడియా మొత్తం వీరిద్దరు ఎప్పుడు దొరుకుతారా అంటూ ఓ కన్నేసి పెట్టింది. నిత్యం వీరికి సంబంధించిన ఏదో ఒక రూమర్ నెట్టింట్లో వినిపిస్తూనే ఉంటుంది. అయితే..వీరు మాత్రం ఎప్పుడు ఈ విషయంపై స్పందించలేదు. మేం జస్ట్ ఫ్రెండ్స్ అని దాటేస్తూ వస్తున్నారు. అయితే తాజాగా వీరి లవ్ విషయం మ్యాన్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ ద్వారా బయటకు వచ్చేసినట్లే కనబడుతోంది.
నేషనల్ క్రష్ రష్మికా మందన్న ప్రేమలో ఎంతో మంది పడ్డారు. అప్పట్లో హీరో రక్షిత శెట్టి తో ఎంగేజ్మెంట్ వరకు వెళ్లి ఆ తర్వాత కొన్ని కారణాలతో ఈ బ్యూటీ ఆ రిలేషన్ కు ఎండ్ కార్డు ఇచ్చేసింది. మరి ఈ చిన్నది ఎవరి ప్రేమలో పడింది అన్న ఈ ప్రశ్నకు వెంటనే ‘ది’ విజయ్ దేవరకొండ అని తెలుగు ప్రేక్షకులతో పాటు సినీ ఇండస్ట్రీ సమాధానం ఇస్తుంది. అయితే ఈరూమర్సపై వాళ్ళిద్దరూ ఎప్పుడూ రెస్పాండ్ కాలేదు. ఈ క్రమంలో సందీప్ వంగ డైరెక్షన్ లో పలు భాషల్లో విడుదల కాబోతున్న యానిమల్ సినిమా ప్రమోషనల్ లో భాగంగా రష్మిక మరోసారి ‘అన్‌స్టాపబుల్ షోకి వచ్చింది.
అన్ స్టాపబుల్ షో తో దుమ్ము దులుపుతున్నారు బాలయ్య. తనదైన స్టైలిష్ యాంకరింగ్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా రష్మిక తన మూవీ అనిమల్ ప్రమోషన్ లో భాగంగా షోలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో విడుదల చేసిన అన్ స్టాపబుల్ ప్రోమో నెట్టింట్లో అదరగొడుతోంది. ప్రమోలో స్క్రీన్ మీద ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ పోస్టర్లు ప్రత్యేక్షమయ్యాయి. అవి చూసిన బాలయ్య వీరిద్దరిలో బెటర్ హీరో ఎవరు? అని అడగండి’ అని బాలకృష్ణకు చెప్పారు. దీంతో బాలయ్య తనదైన స్టైల్ లో ‘రష్మిక… ఇద్దరిలో ఎవరు బావున్నారు?’ అని అడిగారు. అప్పుడు రష్మిక ఏమి చెప్పకుండా మౌనంగా నవ్వుతూ ఉండిపోయింది. ప్రోమోలో అంత వరకే చూపించారు. మరి, ఈ బ్యూటీ ఇచ్చిన ఆన్సర్ ఏమిటో తెలియాలంటే మాత్రం ఈ నెల 24 వరకు వెయిట్ చేయాల్సిందే.
ఈ షోలో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కూడా తన ఫోన్ కాల్ ద్వారా పార్టిసిపేట్ చేశాడు. అయితే…విజయ్ ఫోన్ చేసిన సంగతి రష్మికకు తెలియదు కాబోలు ! ఫోనులో ‘వాట్సాప్ రే’ అంటూ విజయ్ గొంతు వినగానే ముసిముసి నవ్వుల్లో బ్యూటీ మునిగిపోయింది. తర్వాత సందీప్ రెడ్డి వంగా ఫోన్ తీసుకుని విజయ్ తో మాట్లాడుతుండగా… బాలకృష్ణ సందీప్ దగ్గరకు వెళ్లి ”మీ హీరోకి చెప్పు… నేను రష్మికను ప్రేమిస్తున్నా” అని అన్నారు. దీనితో ఇప్పుడు మళ్లీ అన్స్టాటబుల్ షోలో నందమూరి బాలకృష్ణ వీరి లవ్ స్టోరీ బయట పెట్టారని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.