Wed. Jan 21st, 2026

    Balagam Movie : తాజాగా యువ నటుడు ప్రియదర్శి ట్విట్టర్‌లో ఓ వీడియోను షేర్ చేసి “ఇది ప్రేమ కాకపోతే ఇంకేంటి”.. అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం కమెడియన్ వేణు టిల్లు దర్శకత్వంలో తెరకెక్కిన ‘బలగం’ మూవీ సాధారణ ప్రేక్షకుల దగ్గర్నుంచి మెగాస్టార్ చిరంజీవి లాంటి బిగ్ స్టార్స్ వరకూ అందరినీ ఆకట్టుకుంటోంది. సినిమా ఇండస్ట్రీలో కొన్ని భారీ బడ్జెట్ చిత్రాలకి కూడా దక్కని ఆదరణ అతితక్కువ బడ్జెట్‌తో రూపొందిస్తున్న చిత్రాలకి దక్కుతుండటం విశేషం.

    ఆ మధ్య వచ్చిన పెళ్లి చూపులు, కేరాఫ్ కంచరపాలెం, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ.. ఈ మధ్యకాలంలో వచ్చిన జాతిరత్నాలు, డీజే టిల్లు లాంటి తక్కువ బడ్జెట్ చిత్రాలు నిర్మాతలకి లాభాలను బాగా తెచ్చిపెడుతున్నాయి. అంతేకాదు, ఎంతోమంది యంగ్ టాలెంట్ మన తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమవుతున్నారు. పైన ప్రస్తావించిన చిన్న చిత్రాల ద్వారా నటీనటులు, సాంకేతికనిపుణులు..ఇలా అంతా కొత్తవారే పరిచయమవుతున్నారు.

    balagam-movie-If this is not Love then what is?
    balagam-movie-If this is not Love then what is?

    Balagam Movie : అతికొద్దిగంటల్లోనే మెగాస్టార్ చిరంజీవిని చేరుకుంది.

    చిన్న సినిమాగా వచ్చి పెద్ద సక్సెస్ సాధించడం అంటే చెప్పుకోవడానికి చాలా చిన్న విషయంగానే అనిపిస్తుంది. కానీ, ఇలాంటి చిన్న సినిమా బ్రతకాలంటే మాత్రం ఎంతోమంది జీవితాలను గాలికొదిలేసి మొండిగా ప్రయత్నం చేయాలి. అలాంటి వాటికి దక్కే సక్సెస్ వల్ల వారు పొందే ఆనందం అంతాఇంతా కాదు. ఇలాంటి ఆనందంలోనే ఇప్పుడు బలగం చిత్ర యూనిట్ ఉంది. ఈ సినిమా ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా థియేటర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

    మొదటి ఆట నుంచే సూపర్ అంటూ.. టాక్ తెచ్చుకున్న బలగం సినిమా అతికొద్దిగంటల్లోనే మెగాస్టార్ చిరంజీవిని చేరుకుంది. స్వయంగా ఆయన చిత్ర బృందాన్ని అభినందించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఎప్పుడైతే మెగాస్టార్ బలగం చిత్రబృందాన్ని అభినందించారో అప్పటి నుంచీ ఈ సినిమాపై అందరి దృష్టీ పడుతోంది. ఇక ఇప్పుడైతే పల్లే నుంచి జనాలు టౌనుకి బస్సు వేసుకొని బలగం సినిమా చూడటానికి వస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ఓ వీడియోను ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన ప్రియదర్శి తన ట్విట్టర్ ఖాతాలో ఆ వీడియోను షేర్ చేసి “ఇది ప్రేమ కాకపోతే ఇంకేంటి”..అంటూ కామెంట్ పెట్టాడు. ఈ ట్వీట్ బాగా వైరల్ అవుతోంది.

     

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.