Winter Tips: చలికాలం మొదలైందంటే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు మనల్ని చుట్టుముడుతూ ఉంటాయి. ముఖ్యంగా చలికాలంలో తేమ శాతం అధికంగా ఉండటం వల్ల వైరస్ వ్యాప్తి చెందటానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. అందుకే చలికాలంలో చాలామంది వివిధ రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతూ ఉంటారు. ఇలా చలికాలం మొదలవడంతో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు మనల్ని వెంటాడుతాయని వీటి నుంచి బయటపడాలి అంటే కొన్ని రకాల ఆహార పదార్థాలను మనం దూరం పెట్టడం ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు.
మరి చలికాలంలో ఎలాంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి ఏంటి అనే విషయానికి వస్తే.. శీతల పానీయాలను చలికాలంలో పూర్తిగా దూరం పెట్టాలి శీతల పానీయాలతో పాటు వివిధ రకాల పండ్ల రసాలు ఐస్ క్రీమ్ లు, ఆహార పదార్థాలను తీసుకోకపోవడం ఎంతో మంచిది. మిల్క్ షేక్ లో స్మూతీలు పండ్ల రసాలు తినడానికి చాలా రుచికరంగా అనిపించినప్పటికీ ఇది మన శరీరంలో రోగనిరోధక శక్తిని పూర్తిగా బలహీన పరుస్తాయి తద్వారా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు మనల్ని వెంటాడుతాయి.
ఇక శారీరక శ్రమ చేయనటువంటి వారు వీలైనంతవరకు గుడ్లు, పుట్టగొడుగులు, ఎండిన పండ్లు మరియు పెరుగు వంటి హిస్టామిన్ ఆహారాలు శ్లేష్మం ఉత్పత్తిని పెంచుతాయి. మాంసాహారం ,ప్రాసెస్ చేసిన ఆహారాలు తీసుకోవటం వల్ల అవి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇలా శారీరక శ్రమ లేనివారు ఈ పదార్థాలను తీసుకోవడం వల్ల వారికి ఎంతో ఇబ్బందిగా ఉండటమే కాకుండా జీర్ణక్రియ సమస్యలు ఏర్పడతాయి అదేవిధంగా అధిక శరీర బరువు పెరగడం వంటివి జరుగుతుంటాయి. అందుకే చలికాలంలో వీలైనంతవరకు ఇలాంటి ఫుడ్స్ ని దూరంగా పెట్టడం చాలా మంచిది.