Health Tips: ప్రస్తుత కాలంలో చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. ఇలా ప్రతి ఒక్కరు బాధపడే సమస్యలలో ఆ సమస్య ఒకటి. ప్రస్తుతం మారిన జీవనశైలి అలాగే వాతావరణ పరిస్థితులు కారణంగా చాలామంది ఆస్తమా సమస్యతో బాధపడుతూ ఉన్నారు. ఇలా ఆస్తమాతో బాధపడేవారు కొంత దుమ్ము, ధూళి ఉన్న లేదంటే కొంత దూరం నడిచినా కూడా ఎక్కువగా ఈ సమస్య వారిని వెంటాడుతూ ఊపిరి ఆడక ఊపిరి బిక్కిరి అవుతూ ఉంటారు.
ఇలా ఆస్తమా సమస్యలతో బాధపడేవారు ఈ సమస్య నుంచి కాస్త ఉపశమనం పొందాలి అంటే కొన్ని రకాల ఆహార పదార్థాలను మనం తీసుకోకపోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చాలామంది ఉదయం నిద్ర లేవగానే నిమ్మరసం కలుపుకొని వేడి నీళ్లు తాగుతూ ఉంటారు అయితే ఆస్తమా సమస్యతో బాధపడేవారు ఇలా నిమ్మరసం తీసుకోకపోవడం మంచిదని చెబుతున్నారు కేవలం నిమ్మరసం మాత్రమే కాకుండా పుల్లటి నిల్వ చేస్తున్నటువంటి పచ్చళ్ళు పదార్థాలకు కూడా దూరంగా ఉండాలి.
ఇక పాలు పాల ఉత్పత్తులు ఆరోగ్యానికి ఎంతో మంచిది కానీ ఎవరైతే ఆస్తమా సమస్యతో బాధపడుతుంటారు అలాంటి వారు పాలు పెరుగు లేదంటే పాల పదార్థాలకు కాస్త దూరంగా ఉండాలి. వీటితోపాటు వేరుసెనగ సోయా ఉత్పత్తులు చేపలు బీన్స్, క్యాబేజ్, ఉల్లిపాయ, వెల్లుల్లి, కూల్ డ్రింక్స్, ప్రాసెస్ చేసిన మాంసం వంటివి కూడా ఏ మాత్రం మంచివి కావు వీటిని దూరంగా పెట్టడమే మంచిది అలాగే ఆల్కహాల్ కాఫీ టీలు తాగే అలవాటు ఎక్కువగా ఉన్నప్పటికీ వీటిని కూడా వీలైనంతవరకు తగ్గించడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.