Mon. Feb 9th, 2026

    Ashika Ranganath: అమిగోస్ సినిమా ద్వారా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అందాల భామ ఆషికా రంగనాథ్. ఈ అమ్మడుకి తెలుగులో ఇది మొదటి సినిమా అయిన ఇప్పటికే కన్నడ ఇండస్ట్రీలో మాత్రం స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.

    Image

    క్రేజీ బాయ్స్ అనే సినిమాతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసిన ఈ బ్యూటీ తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుసగా ఆఫర్స్ తో ప్రతి ఏడాది రెండు, మూడు సినిమాలు చేస్తూ వస్తుంది. ఇక కళ్యాణ్ రామ్ అమిగోస్ సినిమా ద్వారా టాలీవుడ్ లోకి ఈ అమ్మడు అడుగుపెట్టింది.

    Image

    ఇదిలా ఉంటే ఈ బ్యూటీ తెలుగులో మొదటి సినిమా రిలీజ్ కాకుండా డార్లింగ్ ప్రభాస్ కి జోడీగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా ఖరారు అయ్యింది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ లో కూడా ఆషికా రంగనాథ్ పాల్గొంది.

    Image

    టాలీవుడ్ లో కన్నడ భామలకి మంచి డిమాండ్ ఉంటుంది అనే సంగతి అందరికి తెలిసిందే. అనుష్క శెట్టి కన్నడ భామగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టి స్టార్ హీరోయిన్ అయిపొయింది. ఇక ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా ఉన్న రష్మిక మందన కూడా కన్నడనాట నుంచి వచ్చి తెలుగులో సూపర్ సక్సెస్ అయ్యింది.

    Image

    ఇప్పుడు ఇదే దారిలో ఆషికా రంగనాథ్ కూడా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే మొదటి సినిమా ఆశించిన రిజల్ట్ ని ఈమెకి అందించలేదు. కంటెంట్ బాగుంది అనే టాక్ వచ్చినా కూడా ఎందుకనో సినిమా ఎక్కువ మందికి రీచ్ కాలేదు. ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ సముద్రం ఒడ్డున అందాల చేపపిల్లలా బికినీతో సందడి చేసింది. ఈ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా అవి కాస్తా వైరల్ అవుతున్నాయి.