Ashada Masam: మన తెలుగు మాసాలలో 12 నెలలకు గాను ఒక్కో నెలకు ఒక్కో ప్రాధాన్యత ఉంది. ఇలా ప్రతి మాసం ఎంతో విశిష్టమైన ప్రత్యేకతను కలిగి ఉంది. ఈ విధంగా తెలుగు క్యాలెండర్ ప్రకారం నాలుగవ నెల అయినటువంటి ఆషాడ మాసానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది.ఆషాడ మాసం వచ్చిందంటే చాలు కొత్తగా పెళ్లయిన వధువులు మొత్తం నెల రోజులు తమ పుట్టింటికి వెళ్తారు.ఇలా ఆషాడ మాసంలో వధువు పుట్టింటికి వెళ్లడానికి గల కారణం ఏంటి ఎందుకు నెలరోజులు భర్తకు దూరంగా ఉండాలి అనే విషయాన్ని వస్తే….
కొత్తగా పెళ్లయిన వారు ఆషాడమాసంలో దూరంగా ఉండడానికి మరే ఇతర కారణాలు లేవు ఆషాడమాసం అంటే వ్యవసాయ పనులకు ఎంతో అనువైన సమయం ఇప్పుడు రైతులందరూ కూడా వ్యవసాయ పనులలో బిజీగా ఉంటారు. ఇలాంటి సమయంలో కొత్త అల్లుడు ఇంటికి వస్తే వారికి అతిథ మర్యాదలు చేయడం కుదరదు కనుక భార్య భర్తలు ఆషాడమాసంలో దూరంగా ఉండాలని చెబుతారు. అదేవిధంగా ఆషాడ మాసంలో కనుక గర్భధారణ జరిగితే వారికి పిల్లలు చైత్రమాసంలో జన్మిస్తారు.
Ashada Masam:
ఇలా చైత్రమాసం అంటే విపరీతమైన ఎండలు ఉంటాయి కనుక పిల్లలకు ఇది అనువైన సమయం కాదని భావిస్తారు. అందుకే ఆషాడ మాసంలో గర్భధారణ కూడా మంచి కాదన్న ఉద్దేశంతో పూర్వంలో పెద్దవారు వధూవరులను దూరం పెట్టేవారు. ఆషాడంలో కాకుండా ఇతర మాసాలలో గర్భధారణ జరగడం వల్ల పిల్లలు జన్మించే సమయానికి వాతావరణ పరిస్థితులు కూడా చక్కబడటంతో పిల్లల ఎదుగుదలకు మంచిగా ఉంటుందన్న ఉద్దేశంతో ఆషాడ మాసంలో వధూవరులు దూరంగా ఉండాలని చెప్పేవారు.