జయ శంకర్ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా అరి. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రమోషన్స్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సినిమాను ప్రేక్షకులలోకి తీసుకెళ్ళేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు మూవీ మేకర్స్. అందుకు వినూత్నంగా ప్రమోషన్స్ కార్యక్రమాలను చేస్తున్నారు. ఇంకా సినిమా విడుదల కాలేదు. కానీ ఇప్పటికే ఈ సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ ప్రత్యేక ప్రదేశాలను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, అలాగే మఠాధిపతులు స్వామీజీలు కూడా వీక్షించి సినిమా గురించి గొప్పగా మాట్లాడుతూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
భగవద్గీతలోని సారాన్ని అరి చిత్రంలో అద్భుతంగా చూపించారు అని చూసిన ప్రతీ ఒక్క ఆడియెన్ చెబుతున్నారు. అరిషడ్వర్గాలపై తీసిన ఈ సినిమా ఈ తరం ప్రేక్షకులకు చాలా ముఖ్యం అని, నిజంగా సినిమా చాలా అద్భుతంగా ఉంది అంటూ స్పెషల్ షోని చూసిన వారందరూ తెగ పొగిడేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలను కాస్త వినూత్నంగా చేస్తున్న మూవీ మేకర్స్ ఈ సినిమాను చూసేందుకు చాలా మందికి అవకాశం కల్పిస్తున్నారు. సినిమా విడుదలకు ముందే సినిమాను చూసే అవకాశాన్ని కల్పిస్తున్నారు. అదెలా అంటే జయశంకర్ తాజాగా చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆ పోస్టులో జయశంకర్ విడుదలకు ముందే సినిమాను ప్రత్యేకంగా వీక్షించాలి అనుకునేవారు వివరాలను తెలియజేయండి అంటూ ఒక వాట్సాప్ నెంబర్ను జోడించి ఒక పోస్ట్ ని విడుదల చేశారు. అందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో ఒక వైరల్ కావడంతో పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు నెటిజెన్స్. ఇలా ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలను వినూత్నంగా చేస్తుండడంతో ప్రేక్షకులు ఈ సినిమాపై ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో జాక్వెలిన్ పెర్నాండేజ్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.
Lemon Water: ఇటీవల కాలంలో చాలా మళ్లీ ఆరోగ్యం పై ఎంతో శ్రద్ధ వహిస్తున్నారు ఈ నేపథ్యంలోని ప్రతిరోజు ఉదయం…
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజు లక్షలాదిమంది భక్తుల స్వామి…
Coconut Water: కొబ్బరి నీళ్లలో సహజసిద్ధమైన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. కొబ్బరి నీళ్లలో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం…
Pushpayagam Seva Tickets: తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతి ఏడాది ఎంతో ఘనంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలోనే ఈ…
Papaya: మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహార పదార్థాలతో పాటు పండ్లు కూడా ఎంతో కీలకపాత్ర వహిస్తాయి.…
Sravana Masam: మన తెలుగు క్యాలెండర్ ప్రకారం ఉన్న 12 నెలలకు ఎంతో మంచి ప్రాధాన్యత ఉంది. ఆషాడ మాసం…
This website uses cookies.