Bollywood: 60 ఏళ్ల వయసులో ఆమిర్ ఖాన్ మూడో పెళ్లి.. అస‌లు హైలెట్ అదే..!

Bollywood: బాలీవుడ్‌లో ఎప్పుడు ఏ వార్త సంచలనం సృష్టిస్తుందో ఊహించడం కష్టం. ముఖ్యంగా సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలైతే క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు సరిగ్గా ఇలాంటి ఒక క్రేజీ అప్‌డేట్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్. గత కొన్ని రోజులుగా ఆయన లవ్ లైఫ్, పెళ్లిపై వస్తున్న రూమర్లకు ఎట్టకేలకు ఆయనే స్వయంగా తెరదించారు. తన లాంగ్ టైమ్ పార్ట్‌నర్ గౌరీ స్ప్రెట్‌ను త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేసి అందరికీ పెద్ద షాక్ ఇచ్చారు.

సాధారణంగా అరవై ఏళ్ల వయసు వస్తే చాలామంది రిటైర్మెంట్ లైఫ్ గురించి ఆలోచిస్తారు. కానీ, ఆమిర్ ఖాన్ మాత్రం లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అంటూ 60 ఏళ్ల వయసులో మూడోసారి పెళ్లి పీటలెక్కేందుకు రెడీ అయ్యారు. ముంబైలో జరిగిన ఓ చిత్ర ప్రదర్శనలో పాల్గొన్న ఆయన, జులై 5వ తేదీన ముంబై బాంద్రాలోని తన నివాసంలోనే ఈ పెళ్లి వేడుక జరగనుందని క్లారిటీ ఇచ్చారు. ఇది ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేని, కేవలం ఇరు కుటుంబ సభ్యుల మధ్య అత్యంత నిరాడంబరంగా జరిగే ప్రైవేట్ వెడ్డింగ్ అని, పెళ్లి తర్వాత ఎలాంటి గ్రాండ్ రిసెప్షన్స్ ఉండవని కూడా స్పష్టం చేశారు.

bollywood-aamir-khans-third-marriage-at-the-age-of-60-that-is-the-real-highlight

Bollywood: ఆమిర్ 60వ పుట్టినరోజు వేడుకల్లో తమ రిలేషన్‌షిప్‌ను అఫీషియల్ చేశారు.

ఈ పెళ్లి వెనుక ఒక ఆసక్తికరమైన ఫ్లాష్‌బ్యాక్ కూడా ఉంది. బెంగళూరుకు చెందిన గౌరీ స్ప్రెట్ ముంబైలో బ్యూటీ సెలూన్ నిర్వహిస్తున్నారు. ఆమిర్, గౌరీల మధ్య ఈనాటి బంధం కాదు.. దాదాపు 25 ఏళ్లుగా వీరిద్దరూ మంచి స్నేహితులు. కాలక్రమేణా ఆ స్నేహమే కాస్త ప్రేమగా మారింది. గత రెండేళ్లుగా డేటింగ్‌లో ఉన్న ఈ జంట, గతేడాది ఆమిర్ 60వ పుట్టినరోజు వేడుకల్లో తమ రిలేషన్‌షిప్‌ను అఫీషియల్ చేశారు. ఆమిర్‌కు ఇది మూడో పెళ్లి కాగా, గౌరీకి ఇదివరకే ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు. గతంలో రీనా దత్తా, కిరణ్ రావులతో విడిపోయినప్పటికీ వారితో స్నేహంగా ఉంటున్న ఆమిర్, ఇప్పుడు గౌరీ రాకతో తన జీవితం పరిపూర్ణమైందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

అయితే, ఈ పెళ్లి ప్రకటన అంతటా ఒక ఎత్తు అయితే.. అక్కడ జరిగిన ఒక విచిత్రమైన, అరుదైన సంఘటనే ఇప్పుడు నెట్టింట అసలు సిసలైన హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా తండ్రి రెండో పెళ్లికో, మూడో పెళ్లికో సిద్ధపడితే పిల్లలు దూరంగా ఉండటం లేదా అసంతృప్తిగా ఉండటం చూస్తుంటాం. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఆమిర్ ఖాన్ మీడియా ముందు తన మూడో పెళ్లి వార్తను అధికారికంగా ప్రకటిస్తున్న సమయంలో, ఆయన పెద్ద కుమారుడు జునైద్ ఖాన్ సరిగ్గా తండ్రి పక్కనే నిలబడటం విశేషం. వయసుతో సంబంధం లేకుండా తండ్రి తీసుకున్న ఈ వ్యక్తిగత నిర్ణయాన్ని గౌరవిస్తూ, ఆయనకు వెన్నుదన్నుగా నిలిచిన జునైద్ మెచ్యూరిటీని చూసి బాలీవుడ్ వర్గాలతో పాటు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. తండ్రి కొత్త జీవితంలోకి అడుగుపెడుతుంటే కొడుకు పక్కనే ఉండి మద్దతుగా నిలవడమే ఈ పెళ్లి ప్రకటన మొత్తానికే అసలైన హైలైట్ అని చెప్పాలి.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

1 week ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

1 week ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

4 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

4 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

4 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.