Categories: HealthLatestNews

Headache: తలనొప్పి సమయంలో ఈ తప్పులు చేస్తున్నారా? జర జాగ్రత్త!

Headache: తలనొప్పి అనేది సర్వసాధారణంగా అందరిని వేధించే ఒక సమస్య. ఇటీవల కాలంలో పని ఒత్తిడి కారణంగా ఎంతోమంది ఈ తలనొప్పి సమస్యతో బాధపడుతూ ఉన్నారు. ఇక తలనొప్పి చిన్న పిల్లల నుంచి మొదలుకొని పెద్దవారి వరకు అందరినీ ఎంతగానో వేధిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు తలనొప్పి కాస్త తీవ్రతరం అవుతుంది. ఇలా తలనొప్పి తీవ్రతరం అవుతుంది అంటే మనం చేసే ఈ చిన్న తప్పులే కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తలనొప్పి వచ్చిన సమయంలో పొరపాటున కూడా చిన్నచిన్న తప్పులను చేయకూడదని హెచ్చరిస్తున్నారు. మరి తలనొప్పి వచ్చిన సమయంలో ఎలాంటి పనులు చేయకూడదు? ఆ పనులు చేయటం వల్ల కలిగే నష్టాలు ఏంటి? అనే విషయానికి వస్తే..

తలనొప్పి ఎక్కువగా ఉన్న సమయంలో చాలా మంది విశ్రాంతి తీసుకోకుండా మొబైల్ ఫోన్ చేస్తూ ఉంటారు అలాగే కంప్యూటర్లో ముందు కూర్చుని పనిచేస్తూ ఉంటారు. ఇలా చేయటం వల్ల తలనొప్పి తగ్గకపోగా మరింత తీవ్రతరం అవుతుంది. అదేవిధంగా చాలామందికి చూయింగం నమిలే అలవాటు ఉంటుంది. ఇలా చూయింగం నమలడం వల్ల తలనొప్పి మరింత ఎక్కువవుతుంది తప్ప తగ్గదు. తలనొప్పి కారణంగా చాలామంది బ్రేక్ ఫాస్ట్ లేదా భోజనాన్ని తినడానికి ఇష్టపడరు ఇలా చేయడం వల్ల తలనొప్పి ఎక్కువవుతుంది తప్ప తగ్గదు. కనుక తలనొప్పి ఉన్నప్పటికీ మితంగా బ్రేక్ ఫాస్ట్ అలాగే భోజనం చేయటం చాలా అవసరం.

Mistakes to avoid during headache know details

Headache: చీకటి గదిలో విశ్రాంతి..

ఇక తలనొప్పి ఉన్న సమయంలో ఎక్కువ వెలుతురు కింద నిద్రపోవడం మంచిది కాదు కాస్త చీకటిగా ఉన్న గదిలో విశ్రాంతి తీసుకోవడం వల్ల తలనొప్పి తగ్గుతుంది. ఇక అమ్మాయిలు తలనొప్పి ఉన్నప్పటికీ తమ జుట్టును చాలా బిగుతుగా వేసుకొని ఉంటారు ఇలా వేసుకోవడం వల్ల కూడా తలనొప్పి తీవ్రత ఎక్కువవుతుంది. అందుకే తలనొప్పిగా ఉన్నప్పుడు జుట్టు వదులుగా వేసుకోవడం మంచిది. తలనొప్పి సమయంలో కాస్త ధ్యానం చేయటం అల్లంతో తయారు చేసిన టీ తీసుకోవటం, నుదుటిపై తడిగుడ్డ వేసుకోవడం, తలకు మర్దన చేసుకోవడం వల్ల తొందరగా తలనొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.

Sravani

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

1 week ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

1 week ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

4 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

4 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

4 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.