Durga Pooja: సాధారణంగా మనం ప్రతిరోజు ఉదయం సాయంత్రం మన ఇంట్లో పూజ చేసినప్పుడు లేదా ఆలయానికి వెళ్ళినప్పుడు పుష్పాలను తీసుకొని వెళ్తాము ఇలా వివిధ రకాల పుష్పాలతో స్వామివారిని అలంకరించి పూజలు చేస్తుంటామో ఇలా సువాసనలు వెదజల్లే పుష్పాలతో అలంకరణ చేయడం వల్ల స్వామివారి ప్రీతి చెంది తమ కరుణ కటాక్షాలు మనపై పెడతారని భావిస్తారు.
ఈ క్రమంలోనే దేవతలకు ఎంతో ప్రీతికరమైనటువంటి పుష్పాలతో పూజ చేయడం వల్ల స్వామివారి అనుగ్రహం మనపై ఉంటుంది. ముఖ్యంగా ఆంజనేయ స్వామికి ఎరుపు రంగు పుష్పాలు శివుడికి తెలుపు రంగు పుష్పాలతో పూజించడం ఎంతో మంచిది. ఇలా కొంతమంది దేవతలకు కొన్ని రకాల పుష్పాలతో పూజ చేయడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు. ఈ క్రమంలోనే స్వామి వారి పూజ చేయడానికి పారిజాత పుష్పాలు కూడా ఎంతో ప్రీతికరమైనవిగా భావిస్తారు.
ఇకపోతే మన ఇంట్లో దుర్గ మాత చిత్రపటం ఉన్న లేదా దుర్గ ఆలయానికి వెళ్ళినప్పుడు కొన్ని రకాల పుష్పాలను అసలు తీసుకొని వెళ్లకూడదని పండితులు చెబుతున్నారు.జిల్లేడు, నందివర్ధనం, పారిజాత పుష్పాలు, నాగ చంపా, బృహస్పతి, తంగేడు వంటి పువ్వులతో పూజ చేయకూడదు. ఈ విధమైన పువ్వులతో పూజ చేయడంవల్ల అమ్మవారి అనుగ్రహం కలగడం ఏమోగానీ అమ్మ వారి ఆగ్రహానికి లోనవుతారని పండితులు చెబుతున్నారు. దుర్గామాతకు ఎల్లప్పుడూ సంపెంగ తంగేడు వంటి పుష్పాలతో పూజ చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం పొందవచ్చు.