Smart Phone: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ఫోన్ విరివిగా ఉపయోగిస్తున్న సంగతి మనకు తెలిసిందే. పసిపిల్లల నుంచి మొదలుకొని పండు ముసలి వారి వరకు కూడా స్మార్ట్ ఫోన్ ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు కాస్త గోము చేసిన వారి ముందు సెల్లు పెడుతున్నాము. వారు తినాలన్నా స్నానం చేపించాలన్నా కూడా వారికి సెల్ఫోన్ ఇస్తూ వారిని సెల్ఫోన్లకు బానిసలుగా మారుస్తున్నాము. ఇలా ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా సెల్ ఫోన్ తోనే జీవితం గడపడానికి ఇష్టపడుతున్నారు.
ఇలా రోజులో ఎక్కువ భాగం సెల్ ఫోన్ కి మనం అంకితం అయిపోతే తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని తాజాగా కొరియాలోని హన్యాంగ్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్ హలో పరిశోధనల ద్వారా వెల్లడించింది ముఖ్యంగా కౌమార దశలో ఉన్నటువంటి పిల్లలు రోజుకు నాలుగు గంటలకు మించి సెల్ఫోన్ వాడటం వల్ల వారిలో అధిక ఒత్తిడి కలగడమే కాకుండా డిప్రెషన్ కి గురి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఈ సర్వే ద్వారా వెల్లడించారు.
ఈ దశలో ఉన్నటువంటి పిల్లలు రోజుకు నాలుగు గంటలకు మించి సెల్ ఫోన్ వాడటం వల్ల వారి ఆలోచన విధానం పూర్తిగా మారిపోతుందట ముఖ్యంగా ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు రావడం మాదకద్రవ్యాలు తీసుకోవాలని ఆలోచనలు వస్తున్నాయని పరిశోధకులు వెల్లడించారు. అంతేకాకుండా రాత్రులు సరైన నిద్ర కూడా పట్టడం లేదని ఈ సర్వే ద్వారా తెలిపారు. సెల్ ఫోన్ అధికంగా ఉపయోగించడం వల్ల కొరియాలోని హన్యాంగ్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్ ఈ విషయాలన్నింటినీ కూడా వెల్లడించారు.