Health: మన రోజువారీ దైనందిన జీవితంలో టీ, కాఫీ తాగడం ఒక అలవాటుగా మారిపోయింది. ఉద్యోగాలు చేసే వారు ఒత్తిడిని దూరం చేసుకోవడానికి వీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఇవి బ్రెయిన్ ని విశ్రాంతి స్థితిలోకి తీసుకెళ్తాయని చాలా మంది నమ్మకం. ఆయుర్వేద నిపుణులు కూడా ఇదే మాట చెబుతారు. అయితే అల్లం టీ, గ్రీన్ టీ, పుదీనా టీ, బ్లాక్ టీ లాంటివి త్రాగడం వలన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం ఉంటుందని చెబుతారు. అయితే వీటిని తయారు చేసుకునే విధానం కూడా ఒక పద్ధతిలో ఉండాలని చెబుతారు.
అయితే ఇప్పుడు హెల్త్ టీలు త్రాగడానికి జనాలు మొగ్గు చూపిస్తున్న తరుణంలో చాలా కంపెనీలు ఇన్ స్టెంట్ పౌడర్స్ ని మార్కెట్ లోకి తీసుకొస్తున్నాయి. టీ బ్యాగ్ ల సహాయంతో వాటిని ప్రజా అవసరాలకి అందుబాటులోకి తెస్తున్నాయి. అయితే ఇలాంటి ఇన్ స్టెంట్ టీ బ్యాగ్ లు ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం అని హెల్త్ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. తక్కువ సమయంలో అయిపోవాలని కోరుకుంటూ శారీరక అనారోగ్యాలని కోరి ఆహ్వానిస్తున్నామని చెబుతున్నారు.
ఈ టీ బ్యాగ్ లు ఎందుకు ఆరోగ్యానికి హానికరం అనే విషయాన్ని శాస్త్రీయ ఆధారాలతో సహా మెక్‌గిల్ యూనివర్సిటీ పరిశోధనలో రుజువు చేసింది. అవేంటో చూసుకుంటే ఒక ప్లాస్టిక్ టీ బ్యాగ్ 11.6 బిలియన్ మైక్రోప్లాస్టిక్, 3.1 బిలియన్ నానోప్లాస్టిక్ కణాలను నీటిలోకి విడుదల చేస్తాయి. గ్రీన్‌టీ తాగేటప్పుడు ఈ ప్లాస్టిక్ అంతా వేడి నీటిలోకి కలిసిపోతాయి. ఇవి శరీరానికి చాలా హాని కలిగిస్తాయి. గ్రీన్‌టీ బ్యాగుల్లో ఈజీసీజీ అనే యాంటీ ఆక్సిడెంట్లు తక్కువగా ఉంటాయి. ఒక గ్రీన్ టీ బ్యాగ్‌లో1.09 నుంచి 2.29 mg ఈజీసీజీ ఉంటుందని పరిశోధనల్లో తేలింది.
అలాగే గ్రీన్ టీ బ్యాగ్ లు ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి ఎపిక్లోరోహైడ్రిన్ అనే పురుగుల మందులో ఉపయోగించే కెమికల్స్ ని యూజ్ చేస్తున్నారు. ఇవి క్యాన్సర్ కారకాలు. ఇలాంటి టీ బ్యాగ్స్ తో గ్రీన్ టీ కానీ ఇతర టీలు గాని త్రాగడం వలన క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే ఈ టీ బ్యాగ్ లలో ఉండే కెమికల్స్ శరీరంలో హార్మోన్స్ ఇన్ బ్యాలెన్స్ కి కారణం అవుతాయని, మహిళలలో సంతానోత్పత్తి సమస్యలు తలెత్తడానికి కారణం అవుతాయని అన్నారు.
వీలైనంత వరకు ఇన్ స్టెంట్ టీ బ్యాగ్ ల వినియోగానికి దూరంగా ఉండటం శ్రేయస్కరం అని కూడా సూచిస్తున్నారు. మరి ఇన్ని రకాల అనారోగ్య కారణాలు ఉన్నాయని తెలిసిన కూడా కంపెనీలు తమ స్వలాభం కోసం ప్రజల ప్రాణాలు హరించే విధంగా వీటిని ఉత్పత్తి చేస్తూ మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. ఇకనైనా టీ బ్యాగ్ లు ఉపయోగించి ఇన్ స్టెంట్ టీలు త్రాగేవారు జాగ్రత్తగా ఉండటం ఉత్తమం.