Turmeric: సాధారణంగా ఆయుర్వేద శాస్త్రం ప్రకారం పసుపుకు ఎంతో కీలకమైనటువంటి ప్రాధాన్యత ఉంది. పసుపులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి అనే విషయం మనకు తెలిసిందే. అందుకే ఆయుర్వేదంలో పసుపుకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. అంతేకాకుండా వంటలలో కూడా ఈ పసుపును వేయటం వల్ల వంటకు తగిన రుచి రావడమే కాకుండా పసుపులో ఉన్నటువంటి ఔషధ గుణాలు వంట రూపంలో మనం తీసుకోగలము.
ఇలా ఎంతో ఆరోగ్యకరమైనటువంటి పసుపును మనం ఉపయోగిస్తూ ఉంటాము కానీ కొన్ని రకాల సమస్యలతో బాధపడేవారు పొరపాటున కూడా పసుపును ఉపయోగించకూడదని నిపుణులు చెబుతున్నారు. మరి ఎలాంటి సమస్యలతో బాధపడేవారు పసుపును ఉపయోగించకూడదు అనే విషయానికి వస్తే.. ఆరోగ్యపరంగా సర్జరీలు చేయించుకోవాలనుకునే వారు పసుపు, పసుపు సప్లిమెంట్లను తప్పకుండా మానేయాలని డాక్టర్స్ సూచిస్తున్నారు. రక్తం గడ్డకట్టే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుందట. అందువల్లే సర్జరీ షెడ్యూల్ దగ్గరగా ఉన్నప్పుడు పసుపు మానేయాలి.
డయాబెటిస్ సమస్యతో బాధపడే వారు కూడా పసుపును వాడటం తగ్గిస్తేనే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఐరన్ లోపంతో బాధపడుతున్నవారు తమ డైట్లో పసుపును కొంతవరకు తగ్గిస్తే మంచిది. కొన్ని పరిశోధనల ప్రకారం చూసుకుంటే పసుపు జీర్ణాశయంలోని ఐరన్ శోషణను తగ్గిస్తుంది అందుకే ఐరన్ సమస్యతో బాధపడేవారు కూడా పసుపును తగ్గించడం ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.