Thu. Jan 22nd, 2026

    Turmeric: సాధారణంగా ఆయుర్వేద శాస్త్రం ప్రకారం పసుపుకు ఎంతో కీలకమైనటువంటి ప్రాధాన్యత ఉంది. పసుపులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి అనే విషయం మనకు తెలిసిందే. అందుకే ఆయుర్వేదంలో పసుపుకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. అంతేకాకుండా వంటలలో కూడా ఈ పసుపును వేయటం వల్ల వంటకు తగిన రుచి రావడమే కాకుండా పసుపులో ఉన్నటువంటి ఔషధ గుణాలు వంట రూపంలో మనం తీసుకోగలము.

    ఇలా ఎంతో ఆరోగ్యకరమైనటువంటి పసుపును మనం ఉపయోగిస్తూ ఉంటాము కానీ కొన్ని రకాల సమస్యలతో బాధపడేవారు పొరపాటున కూడా పసుపును ఉపయోగించకూడదని నిపుణులు చెబుతున్నారు. మరి ఎలాంటి సమస్యలతో బాధపడేవారు పసుపును ఉపయోగించకూడదు అనే విషయానికి వస్తే.. ఆరోగ్యపరంగా సర్జరీలు చేయించుకోవాలనుకునే వారు పసుపు, పసుపు సప్లిమెంట్లను తప్పకుండా మానేయాలని డాక్టర్స్ సూచిస్తున్నారు. రక్తం గడ్డకట్టే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుందట. అందువల్లే సర్జరీ షెడ్యూల్ దగ్గరగా ఉన్నప్పుడు పసుపు మానేయాలి.

    డయాబెటిస్ సమస్యతో బాధపడే వారు కూడా పసుపును వాడటం తగ్గిస్తేనే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఐరన్ లోపంతో బాధపడుతున్నవారు తమ డైట్​లో పసుపును కొంతవరకు తగ్గిస్తే మంచిది. కొన్ని పరిశోధనల ప్రకారం చూసుకుంటే పసుపు జీర్ణాశయంలోని ఐరన్​ శోషణను తగ్గిస్తుంది అందుకే ఐరన్ సమస్యతో బాధపడేవారు కూడా పసుపును తగ్గించడం ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు.