Wed. Jan 21st, 2026

    Technology: పరుగులు పెడుతున్న ప్రపంచంతో పాటు టెక్నాలజీ కూడా రోజు రోజుకి అదే స్థాయిలో అభివృద్ధి చెందుతుంది. ఇక ఈ టెక్నాలజీకి ప్రజలు కూడా బాగా అలవాటవుతున్నారు. ప్రజలని ఆకర్షించడానికి టెక్నాలజీలో మార్పులు చేస్తూ ఎప్పటికప్పుడు వారు మరింత సులభంగా వినియోగించేలా సాంకేతిక విజ్ఞానం అభివృద్ధి చెందుతుంది. అదే సమయంలో ప్రజా భద్రతని దృష్టిలో ఉంచుకొని టెక్ కంపెనీలు చాలా తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి.

    ప్రస్తుతం ప్రపంచంలో ప్రజలు ఎక్కువగా వాడే సోషల్ మీడియా, వీడియో స్ట్రీమింగ్ సర్వీస్ లు యూట్యూబ్, అలాగే ఫేస్ బుక్, ట్విట్టర్ ఉన్నాయి. ఇక మెసెంజర్ సర్వీస్ లలో వాట్సాప్ ఉంది. ప్రపంచంలో మెజారిటీ ప్రజలు వీటిని వినియోగిస్తు న్నారు. అయితే కొన్ని సంఘ విద్రోహ శక్తులు, అలాగే సైబర్ మాఫియాలు తప్పుడు మార్గంలో వినియోగిస్తున్నాయి. యూట్యూబ్ ద్వారా అయితే విద్రోహ శక్తులు ప్రమాదకర నెగిటివ్ కంటెంట్ ని స్ప్రెడ్ చేస్తున్నాయి.

    are you posting unofficial videos know about this
    are you posting unofficial videos know about this

    అలాగే ఫేస్ బుక్, ట్విట్టర్ ద్వారా కూడా ప్రజలని ఇన్ఫ్లుయెన్స్ చేసే కమ్యూనిటీ వయొలెన్స్ ని ప్రేరేపించే కంటెంట్ ని స్ప్రెడ్ చేస్తున్నాయి. దీనికి కారణం వాటిలో వీడియో, కంటెంట్ పోస్టింగ్ ని ఫేక్ అకౌంట్స్ ద్వారా కూడా పెట్టడానికి కూడా అవకాశం ఉండటమే అనే విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ సోషల్ మీడియా సంస్థలు వీటిని కంట్రోల్ చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్న ప్రపంచ దేశాలలో ప్రతి దేశానికి ఉండే రూల్స్, పాలసీలు వేరుగా ఉండటంతో అన్ని చోట్ల సాధ్యం కావడం లేదు.

    సంఘ విద్రోహ శక్తులు వయోలెంట్ కంటెంట్ ని స్ప్రెడ్ చేస్తూ కుల, మత, ప్రాంతీయ, జాతి విద్వేషాలు పెంచి పోషిస్తున్నారు. అయితే ఇకపై యూట్యూబ్ ఈ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేస్తుంది. ఇకపై గూగుల్ తో అనుబంధంగా యూట్యూబ్ సహా ఇతర ప్లాట్ ఫాన్స్ లో అనధికార అప్లోడ్ పై కాపీరైట్ వైలేషన్ యాక్ట్ ని సీరియస్ గా అమలు చేయడంతో ఆ అనధికార అప్లోడ్ లని అడ్డుకునేందుకు ఆయా వ్యక్తులకి జరిమానా విధించే ఆలోచనని కూడా చేస్తుంది.

    అయితే ఈ జరిమానా ఆ ఖాతాదారుల నుంచి ఎలా వసూలు చేయాలి అనే విషయాలపై సీరియస్ గా వర్క్ చేస్తుంది. ఇలా చేస్తే యూట్యూబ్ లో కాపీ రైట్ వైలేషన్ తగ్గే అవకాశం ఉంటుందని, అలాగే విద్వేషపూరిత కంటెంట్ కూడా నియంత్రించవచ్చని ఆలోచిస్తుంది.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.