Tooth Brush: ప్రతిరోజు ఉదయం సాయంత్రం బ్రష్ చేయటం వల్ల పళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇలా బ్రష్ చేయటం వల్ల ఏ విధమైనటువంటి దంత సమస్యలు లేకుండా మన పళ్ళను మనం కాపాడుకోవచ్చు అనే సంగతి మనకు తెలిసింది అయితే చాలామంది బ్రష్ చేసిన తర్వాత వారి బ్రష్ ఇష్టానుసారంగా ఎక్కడపడితే అక్కడ పెట్టేస్తూ ఉంటారు చాలా మంది బ్రష్ చేస్తున్న తర్వాత వారి బ్రష్ అలాగే వాష్ రూమ్ లోనే పెట్టేస్తూ ఉంటారు ఇలా పెడుతున్నారు అంటే మీరు ప్రమాదంలో పడినట్లేనని నిపుణులు చెబుతున్నారు.
బాత్రూంలో మనకు తెలియని కంటికి కనిపించని ఎన్నో సూక్ష్మజీవులు ఉంటాయి. అయితే మన పంటిని నోటి ఆరోగ్యాన్ని కాపాడుకొనే బ్రష్ అక్కడే పెట్టడం వల్ల ఎన్నో రకాల సూక్ష్మజీవులు బ్రష్ పైకి వస్తాయి. ఇలా బ్రష్ మీదకు సూక్ష్మజీవులు రావడం వల్ల తిరిగి మనం దానితో బ్రష్ చేస్తే మనకు తెలియకుండానే మనం ఎన్నో రకాల సూక్ష్మజీవులను మనలోకి పంపిస్తున్నాము. ఇలా బాత్రూంలో బ్రష్ చేయడం వల్ల కొన్నిసార్లు మనం టాయిలెట్ కి వెళ్లి ఫ్లెష్ చేయడం వల్ల ఆ నీటి బిందువులు కూడా బ్రష్ పై పడే అవకాశాలు ఉంటాయి.
ఇలా ఎప్పుడూ కూడా బ్రష్ బాత్రూంలో పెట్టకూడదని ఒకవేళ పెట్టేలాగా ఉంటే వాటికి తప్పనిసరిగా క్యాప్స్ ఉపయోగించడం ఎంతో మంచిది ఆ క్యాప్ కూడా బ్రష్ మొత్తం తడి ఆరిపోయిన తర్వాత క్యాప్ వేసి బాత్రూంలో పెట్టుకోవడం మంచిది. వీలైనంతవరకు మనం మన బ్రష్ లను బాత్రూంలో పెట్టకపోవడమే మంచిదని నిపుణులు తెలియజేస్తున్నారు.