Urin Problem: సాధారణంగా చాలామందికి గంటకు రెండు మూడు సార్లు అయినా యూరిన్ వెళ్లే అలవాటు ఉంటుంది ఇలా తరచూ యూరిన్ కి వెళ్లడం వల్ల ఎంతో ఇబ్బందికరంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎక్కడికైనా ప్రయాణాలు చేయాలన్నా కూడా సౌకర్యంగా ఉండదు అందుకే ఇలాంటి సమస్య ఉన్నటువంటి వారు బయటకు వెళ్లడానికి పెద్దగా ఇష్టపడరు అయితే ఇలా తరచూ రావడానికి కారణం లేకపోలేదు మధుమేహ వ్యాధితో బాధపడుతున్నటువంటి వారికి ఇలాంటి సమస్య ఉంటుంది.
మీరు కనుక మధుమేహ వ్యాధితో బాధపడుతున్నట్లయితే తరచూ మూత్ర విసర్జనకు వెళ్లాల్సి ఉంటుంది అయితే మీకు షుగర్ లేకపోయినా కూడా తరచూ యూరిన్ వస్తుంది అంటే మీరు ప్రమాదంలో పడినట్లేనని నిపుణులు చెబుతున్నారు. ఇలా తరచూ యూరిన్ వెళ్తున్నారు అంటే మీరు క్యాన్సర్ బారిన పడ్డారని సంకేతం. ఇలాంటి లక్షణాలు ప్రోస్ట్రేట్ క్యాన్సర్ కి కారణమని నిపుణులు తెలియజేస్తున్నారు.
యూరిన్ లో రక్తం రావడంతో పాటు మూత్రవిసర్జనకు వెళ్లిన సమయంలో ఇబ్బందిగా ఉన్నా, అత్యవసరంగా యూరిన్ కు వెళ్లాల్సిన అవసరం ఉన్నట్లు అనిపించిన ఈ క్యాన్సర్ లక్షణాలు అని భావించవచ్చు. వయసు పైపడే వారిలో ఈ విధమైనటువంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి లక్షణాలు కనుక కనబడితే వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లి తగు పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. తరచుగా మూత్రవిసర్జన చేయడంపై మెడికల్ జర్నల్ ది లాన్సెట్ పరిశోధన జరిపిందని తెలుస్తోంది. దీని ప్రకారం ఈ విధంగా యూరిన్ కు వెళ్లడం ప్రోస్టేట్ క్యాన్సర్ కు కారణం అయ్యే విస్తారిత ప్రోస్టేట్ లక్షణం అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.