Health: పనిలో చాలా వేగంగా నీరసించిపోతున్నారా? అయితే ఈ డ్రింక్ తాగండి..

Health: ప్రస్తుత దైనందిన జీవితంలో శారీరక శ్రమతో పాటు మానసిక శ్రమ కూడా ఎక్కువగా ఉండే ఉద్యోగాలలో ప్రజలు పని చేస్తున్నారు. రోజువారి జీవనం సక్రమంగా సాగాలంటే అధిక ఆదాయం ఉండాల్సిందే దీనికోసం డబ్బు వచ్చే మార్గాలు అన్వేషిస్తున్నారు. అయితే అక్రమ మార్గంలో కాకుండా తమ సామర్ధ్యంతోనే కుటుంబ ఆర్ధిక అవసరాలకి సరిపోవడంతో పాటు భవిష్యత్తుకి భరోసా ఇచ్చే స్థాయిలో ఆదాయాన్ని ఆర్జించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో శారీరక శ్రమతో పాటు మానసిక ఒత్తిడి కూడా ఎక్కువ అవుతుంది. ఈ నేపధ్యంలో తమ రోజువారి పనులలో వేగంగా నీరసించిపోవడం జరుగుతుంది. కరోనా ఎఫెక్ట్ తర్వాత కోవిడ్ బారిన పడ్డవారిలో వ్యాధి నిరోధక శక్తి క్షీణించింది అని వైద్యులు చెబుతున్నారు. ఈ ఇమ్మ్యూనిటి పవర్ తక్కువగా ఉండటం వలన వారు కూడా రోజువారి పనులలో చాలా వేగంగా నీరసించి పోతారు.

ఒక్కసారి శరీరానికి నీరసం వస్తే ఇక ఎలాంటి పని చేయలేరు. శరీరం మొత్తం అలసిపోతే మానసికంగా కూడా తీవ్ర అలసట వచ్చేస్తుంది. ఇక ఆ సమయంలో పని చేయాలనే ఉత్సాహం అస్సలు రాదు. ఈ మధ్యకాలంలో ఇలా శారీరక శ్రమతో నీరసం అనేది చాలా మందికి వస్తుంది. అయితే ఈ నీరసం తగ్గాలన్నా, వేగంగా అలసటకి గురికాకుండా ఉండాలన్నా రోజువారి ఆహారపు అలవాట్ల విషయంలో ప్రోటీన్ కంటెంట్ ఉన్న ఫుడ్, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. శరీరానికి ఎలాక్త్రోల్ శక్తి ఎంత ఎక్కువగా ఉంటే పని చేసే సమయంలో అంత ఎనర్జీగా ఉంటాం. మినరల్స్, ఎలాక్త్రోల్స్ స్థాయి తగ్గితే వేగంగా నీరసించిపోతారు. అయితే నీరసం అనేది తగ్గాలంటే ప్రతి రోజు ఉదయాన్నే ఒక ప్రోటీన్ డ్రింక్ తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్ అయిన అంజీర, వాల్ నట్స్, బాదం, పిస్తా, ఎండు ద్రాక్ష, కర్జూరం రాత్రి నిద్రపోయే ముందు నానబెట్టాలి. వాటిని ఉదయాన్ని శుభ్రం చేసి వాటిని మిల్క్ లో వేసి జ్యూస్ తరహాలో ప్రిపేర్ చేయాలి. అలా డ్రైఫ్రూట్స్ మిల్క్ షేక్ ని ప్రతి రోజు బ్రేక్ ఫాస్ట్ సమయంలో తీసుకుంటే శరీరానికి కావాల్సినంత ఎనర్జీని అందించడంలో ఎనర్జీ బూస్టర్ పని చేస్తుంది. ఈ డ్రింక్ తాగడం వలన శరీరానికి ప్రోటీన్ కంటెంట్ పుష్కలంగా అందడంతో పాటు ఎనర్జిటిక్, ఉత్సాహంగా మారడంతో పాటు బరువు కూడా తగ్గుతారు. అలాగే మెదడు చురుకుగా పనిచేయడంలో ఈ డ్రైఫ్రూట్స్ మిల్క్ షేక్ చాలా అద్బుతంగా పని చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. చీటికి మాటికి, ఎక్కువ సమయం పనిచేయలేక నీరసించిపోయేవారు ఈ డ్రింక్ ని ప్రతి రోజు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Virinchi Varma: ‘జితేందర్ రెడ్డి’ సినిమా అందుకే చేశాను..

Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…

4 days ago

Raashii Khanna: అది నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..?

Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…

2 weeks ago

Tollywood: కాంబో ఫిక్స్..కానీ కథే కుదరలా..?

Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…

2 weeks ago

SSMB29: జనవరి నుంచి వచేస్తున్నాం..

SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…

2 weeks ago

The Raja Saab: ప్రభాస్ లుక్ చూస్తే రజినీకాంత్ గుర్తొస్తున్నారా..?

The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…

2 weeks ago

Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ..

Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…

2 weeks ago

This website uses cookies.