Teeth Yellow: ప్రతి ఒక్కరు ఎంతో అందంగా కనపడాలి అంటే పళ్ళు కూడా ఎంతో కీలకపాత్ర పోషిస్తాయి. పళ్ళు తెల్లగా ఉన్నప్పుడే వారిలో ఆత్మవిశ్వాసం పెరిగే ప్రతి ఒక్కరిలోనూ చాలా సంతోషంగా స్వేచ్ఛగా నవ్వుతూ మాట్లాడగలరు. అయితే చాలామందికి పళ్ళు పసుపు పచ్చ రంగులో ఉండటం వల్ల నలుగురిలో కలిసి మాట్లాడటానికి కూడా ఇష్టపడరు. అయితే చాలామంది ప్రతి రోజు బ్రష్ చేస్తున్నప్పటికీ పళ్ళు పసుపు రంగులోనే ఉంటాయి. ఈ విధంగా బ్రష్ చేసిన పళ్ళు పసుపు రంగులో ఉన్నాయి అంటే మీరు కొన్ని పొరపాట్లు చేస్తున్నారని అర్థం.
Teeth Yellow: బ్రష్ చేసిన పళ్ళు పసుపు రంగులో ఉన్నాయి అంటే..?
బ్రష్ చేసిన పళ్ళు పసుపు రంగులో ఉన్నాయి అంటే మీరు ఎక్కువగా సోడా,కాఫీ, టీ, రెడ్ వైన్ తీసుకుంటున్నారని అర్థం. ప్రతిరోజు వీటిని అధికంగా తీసుకోవడం వల్ల పళ్ళు పసుపు రంగులోనే ఉంటాయి. అందుకే వీలైనంతవరకు వీటిని తగ్గించడం మంచిది.సోడాలో దంతాల పై పొరను తొలగించే రసాయనాలు ఉంటాయి. ఫలితంగా దంతాలపై మరకలు, రంగు మారడం మొదలవుతుంది. అదేవిధంగా పొగాకు నమలడం, ధూమపానం చేయడం కూడా పళ్ళు పసుపు పచ్చగా మారడానికి కారణమవుతాయి.
మీరు ఈ అలవాట్లను ఎంత తొందరగా మానేస్తే అంత తొందరగా దంతాలు కూడా ఆరోగ్యంగా మారుతాయి. ఇది కాకుండా కొన్ని మందులు దంతాల పసుపు రంగుకు కారణమవుతాయి. వీటిలో అధిక రక్తపోటు, కీమోథెరపీ, యాంటీబయాటిక్స్ వంటి మందులు ఉన్నాయి.పిల్లల్లో చిన్నప్పటి నుంచే దంతాలు పసుపు రంగులో కనిపిస్తాయి. దీనికి పోషకాల కొరత కారణం కావచ్చు. దీని కారణంగా దంతాల బయటి పొర సరిగా అభివృద్ధి చెందదు. దంతాలు పసుపు రంగులోకి మారుతూ ఉంటాయి.