AR Rehaman: ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. అతని కెరియర్ ఇంగ్లీష్, హిందీ సినిమాలు ఎక్కువగా ఉంటాయి. ఇండియాలోనే నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా విశేషమైన కీర్తి సొంతం చేసుకున్న రెహమాన్ ఆస్కార్ అవార్డు అందుకున్న తొలి ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్ గా గుర్తింపు పొందాడు. అయితే ఆయన అసిస్టెంట్ గా కెరియర్ స్టార్ట్ చేసింది మాత్రం టాలీవుడ్ సంగీత దర్శకులు అయిన కోటి, కీరవాణి దగ్గర కావడం విశేషం. రాజ్ కోటి కాంబినేషన్ లో చాలా సినిమాలకి ఆయన కీబోర్డు ప్లేయర్ గా పనిచేశారు. తరువాత మ్యూజిక్ డైరెక్టర్ గా మారాయు.
అయితే కెరియర్ ఆరంభంలో వెంకటేష్ తో సూపర్ పోలీస్ అనే సినిమాకి రెహమాన్ మ్యూజిక్ అందించారు. అది డిజాస్టర్ అయ్యింది. అలాగే రాజశేఖర్ గ్యాంగ్ మాస్టర్ సినిమాకి సంగీతం అందించారు. అది కూడా డిజాస్టర్ అయ్యింది. తరువాత దశాబ్దకాలం గ్యాప్ తర్వాత మహేష్ బాబు నాని సినిమాకి సంగీతం అందించారు. ఆ మూవీ కూడా డిజాస్టర్ అయ్యింది. మళ్ళీ చాలా గ్యాప్ తీసుకొని పవన్ కళ్యాణ్ కొమరం పులి సినిమాకి రెహమాన్ సంగీతం అందించారు. ఆ మూవీ కూడా డిజాస్టర్ అయ్యింది.
అయితే తెలుగులో రెహమాన్ నుంచి వచ్చిన ఒకే ఒక హిట్ మూవీ ఏ మాయ చేసావే. నాగచైతన్య రెండో సినిమాగా ఆ మూవీ రావడం విశేషం. స్టార్ హీరోలకి మాత్రం రెహమాన్ డిజాస్టర్స్ ని ఇచ్చారు. అయితే చాలా కాలం తర్వాత మరల రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా కోసం ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. తాజాగా ఈ విషయం కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తుంది. సుదీర్ఘ కాలం గ్యాప్ తర్వాత రెహమాన్ మరల రామ్ చరణ్ మూవీకి సంగీతం అందిస్తూ ఉండటం విశేషం. అయితే టాలీవుడ్ లో డిజాస్టర్ రికార్డులకి ఈ రామ్ చరణ్ మూవీ అయిన బ్రేక్ ఇస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.