AP Politics: ఏపీ రాజకీయాలలో అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ వచ్చే ఎన్నికలలో గెలవడానికి ఎత్తులు పైఎత్తులు వేస్తోంది ప్రజా క్షేత్రంలో ముందుకు దూసుకుపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏకంగా 175 స్థానాల్లో గెలిచి అధికారంలోకి రావాలని వైసీపీ భావిస్తోంది. ఇక తెలుగుదేశం పార్టీ కూడా 150 స్థానాల్లో గెలవాలని వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఎవరి లక్ష్యాలు నిర్దేశించుకుని రాజకీయ రణక్షేత్రంలో ప్రజల మధ్య తిరుగుతూ ఉన్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో కొత్త రాజకీయం తెరపైకి వచ్చింది.
ఏపీలో ఉన్నా ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్షనేత చంద్రబాబుల్లో ఎవరు ధనవంతులు అనే చర్చ మొదలైంది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ప్రకారం దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రుల జాబితాలో వైఎస్ జగన్ మొదటి స్థానంలో ఉన్నారు. దీనిపై గత కొద్ది రోజులుగా తెలుగుదేశం, జనసేన పార్టీలు టార్గెట్ చేస్తున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి అంత కాస్ట్లీ అని విమర్శలు చేస్తున్నారు. దోచుకోవడమే పనిగా పెట్టుకున్న ముఖ్యమంత్రికి ప్రజల కష్టాలు ఇంకేం తెలుస్తాయి అంటూ టార్గెట్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు అదే సంస్థ దేశంలో అత్యంత ధనవంతులైన ఎమ్మెల్యేల జాబితాలో చంద్రబాబు నాయుడు మూడో స్థానంలో ఉన్నాడని పేర్కొంది. దీంతో ఇప్పుడు టీడీపీ పార్టీకి మాట రాకుండా అయిపొయింది. ఏదో ఒక విధంగా అధికార పార్టీ వైసీపీని టార్గెట్ చేద్దామని అనుకున్న టీడీపీకి ఇప్పుడు చంద్రబాబు కూడా ధనిక ఎమ్మెల్యేల జాబితాలో ఉన్నాడనే విషయం తెరపైకి రావడంతో సైలెంట్ అయిపోయారు. మొత్తానికి ఏపీలో రాజకీయ నాయకులు ఈ స్థాయిలో ధనవంతులుగా ఉన్నారు కాబట్టి డబ్బు పెట్టి ఓట్లు కొనడానికి వెనుకాడటం లేదనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తోంది.