Wed. Jan 21st, 2026

    Politics: మూడేళ్ళ తర్వాత ప్రధానమంత్రి మోడీతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు. మిత్రపక్షం అన్న తర్వాత కలయిక సర్వసాధారణం అనే విషయం అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ కలయిక ఓ వైపు టీడీపీ పార్టీలో గుబులు పుట్టిస్తుంది. మరో వైపు మోడీ పర్యటనకి దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు జన సమీకరణ కూడా చేస్తున్న వైసీపీకి కూడా మింగుడుపడని అంశంగా మారింది. ప్రధాని కార్యాలయం నుంచి పవన్ కళ్యాణ్ కి నేరుగా మోడీని కలవాలని పిలుపు వచ్చింది. మొన్నటి వరకు జనసేనకి ప్రధాని మోడీ, అమిత్ షా కనీసం ఆపాయిట్మెంట్ కూడా ఇవ్వలేదు అంటూ సోషల్ మీడియాలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం చేశారు.

    ఇప్పుడు ఊహించని విధంగా మోడీ అభివృద్ధి కార్యక్రమాలని ప్రారంభించడానికి ఏపీకి రావడం, పవన్ కళ్యాణ్ ని కలవాలని కబురు పంపడం జరిగింది. ఈ విషయం వైసీపీ అధిష్టానంకి అస్సలు మింగుడు పడటం లేదు. దీనికి కారణంగా ఏపీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు తమకి అతిపెద్ద శత్రువుగా మారిపోయాడు. ప్రజలలో కూడా పవన్ కళ్యాణ్ పొలిటికల్ గ్రాఫ్ పెరిగిపోతుంది. ఈ నేపధ్యంలో పవన్ కళ్యాణ్ ని వీలైనంత తక్కువ చేయాలని, అతన్ని అణచివేయాలని వైసీపీ నాయకత్వం ప్రణాళికలు రచిస్తుంది. అందులో భాగంగా వ్యక్తిగత విమర్శలు చేస్తూ పవన్ కళ్యాణ్ ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది.

    ap politics become more intresting with modi and pawan kalyanఅలాగే జనసేన కార్యకర్తలు, మద్దతుదారులపై దాడులు చేయడం. జనసేనాని సహకరించకుండా ప్రజలని భయపెట్టే ప్రయత్నం చేస్తుంది. మరో వైపు ఏపీలో బీజేపీ నాయకులతో విభేదించిన కేంద్రంలో మోడీని మాత్రం ప్రసన్నం చేసుకునే ప్రయత్నం వైసీపీ అధిష్టానం చేస్తుంది. ఇందులో భాగంగా ప్రధాని పర్యటనకి సంబందించిన ఏర్పాట్లు దగ్గరుండి చూసుకుంటుంది. ఈ వ్యవహారాలు అన్ని విజయసాయి రెడ్డి చక్కబెడుతున్నారు. అయితే వైసీపీ ఇంత చేసిన ముఖ్యమంత్రి జగన్ కి వ్యక్తిగతంగా కలిసేందుకు ప్రధాని మోడీ అవకాశం ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ కి ఇవ్వడం ఏపీ రాజకీయాలలో ప్రాధాన్యత సంతరించుకుంది. విశాఖ ఇష్యూ తర్వాత పవన్ కళ్యాణ్ నేరుగానే బీజేపీపై ఓ రకమైన విమర్శలు చేశారు.

    వారి కాళ్ళు పట్టుకొని బ్రతిమాలాడుకునే కర్మ తనకి పట్టలేదని. మోడీపై అభిమానం ఉన్నా కూడా రూట్ మ్యాప్ కోసం ఇక వేచి చూసే ధోరణి ఉండదని, వీలైనంత త్వరగా వారు స్పందించకుండా నేనే నా ప్లాన్ లో ముందుకి వెళ్తానని చెప్పేసారు. దీంతో బీజేపీ అధిష్టానంలో కూడా కదలిక వచ్చింది. పవన్ కళ్యాణ్ సాయంతో ఏపీలో బలపడాలని బీజేపీ భావిస్తుంది. పవన్ కళ్యాణ్ తమ నుండి దూరంగా వెళ్తే అసలుకే ప్రమాదం వస్తుందని భావించారు. ఈ నేపధ్యంలోనే ప్రధానితో పవన్ కళ్యాణ్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. మోడీని కలిసి మాట్లాడిన తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహాలు ఎలా ఉంటాయి. టీడీపీతో కలిసి వెళ్లడంపై పునరాలోచన చేస్తారా లేక బీజేపీతో కలిసి ఒంటరి పోరాటం చేస్తారా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. మీడియాతో పాటు, ప్రధాన రాజకీయ పార్టీలు పవన్, మోడీ కలయికతో ఏం జరగబోతుంది అనేది తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.