Dasara Movie : నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన తాజా చిత్రం దసరా. ఈ వారం భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాని కెరీర్‌లో ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా కావడం మరో విశేషం. నానికి ఇప్పటి వరకు క్లాస్ హీరో అని ఇమేజ్ ఉంది. అందులో నుంచి బయటకి వచ్చి మాస్ ఇమేజ్ కోసం చేసిన పెద్ద సాహసమే దసరా. సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల ఈ మూవీతో టాలీవుడ్‌కి దర్శకుడిగా పరిచయమయ్యాడు.
కథాంశం కొత్తది కావడంతో నాని, కీర్తి సురేష్‌లతో పాటుగా మేకర్స్ ఈ మూవీపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అంతేకాదు, నాని-కీర్తిలకి పాన్ ఇండియన్ రేంజ్‌లో ఊహించని సక్సెస్ వస్తుందని నమ్మకంగా ఉన్నారు. కానీ, అందరి అంచనాలను తారుమారు చేస్తూ దసరా డివైడ్ టాక్‌ను తెచ్చుకుంది. ఇదే కాదు..సినిమా చూసిన కొందరు ఫ్లాప్ అనే మాట కూడా అన్నారు. ఇండియా కంటే ముందే యూఎస్ ప్రీమియర్స్ చూసిన సినీ లవర్ దసరా ఫ్లాప్ మూవీ అని సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను తెలిపారు.
అదే టాక్ మన ఇండియాలో కూడా వినిపిస్తోంది. ఇటీవల కాలంలో అటు నానీకి ఇటు కీర్తి సురేష్‌కి ఆశించిన సక్సెస్ అందడం లేదు. ముఖ్యంగా కీర్తి సురేష్ ఉంటే సినిమా గ్యారెంటీగా ఫ్లాప్ అనే టాక్ చాలాసార్లు వినిపించింది. మహానటి తర్వాత ఆమె నటించిన సినిమాలన్నీ ఫ్లాపవడమే దీనికి కారణం. గతచిత్రం సర్కారు వారి పాట తర్వాత కీర్తికి అవకాశాలు కష్టమే అనుకున్నారు. అదృష్ఠంకొద్దీ మెగాస్టార్ భోళా శంకర్, నాని దసరా సినిమాలలో ఛాన్స్ దక్కించుకుంది. వీటిలో దసరా ఫ్లాప్. దాంతో కీర్తిపై ఇంకాస్త నెగిటివిటీ పెరిగింది.
అయితే, ఇదే దసరా సినిమా మాస్ ఆడియన్స్ కొందరికి బాగా కనెక్ట్ అయింది. వాస్తవంగా దర్శకుడు ఎంచుకున్న కథాంశం అటు తమిళం, ఇటు మలయాళ ప్రేక్షకులకి కూడా బాగా కనెక్ట్ అయ్యేది. కానీ, కథనం దెబ్బకొట్టింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో పట్టులేకపోవడం..రిపీటెడ్ సీన్స్ సినిమా ఫ్లాప్‌కి కారణం అయ్యాయి. మొదటి అర్థభాగం ఉన్నట్టుగ్గా రెండవ అర్థభాగం ఉంటే నానీ, కీర్తి సురేష్‌ల కెరీర్‌కి మైల్ స్టోన్ మూవీ అయ్యేది. కానీ, సీన్స్ రివర్స్ అవడమే కాకుండా కీర్తి నెగిటివ్ వైబ్స్ సినిమాపై పడ్డాయనే మాట గట్టిగా వినిపిస్తోంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.