Lord Hanuma: సాధారణంగా మనం ప్రతిరోజు ఒక్కో దేవుడిని ఒక్కో విధంగా పూజిస్తూ ఉంటాము అయితే ఎంతోమంది సోమవారం శివుడిని పూజిస్తూ శివుడికి ఇష్టమైన పదార్థాలతో అభిషేకం చేయడం, స్వామివారికి ఇష్టమైన పదార్థాలను నైవేద్యంగా సమర్పించడం చేస్తుంటారు అలాగే మంగళవారం ఆంజనేయస్వామిని పూజిస్తూ ఉంటారు. ఇలా ఒక వారం ఒక్కో దేవుడిని పూజిస్తూ స్వామి వారికి ఇష్టమైన పదార్థాలతో అభిషేకాలు నైవేద్యాలను సమర్పిస్తూ ఉంటారు.
ఈ క్రమంలోనే మంగళవారం లేదంటే శనివారం పెద్ద ఎత్తున హనుమంతుడికి కూడా పూజలు చేస్తూ ఉంటారు ఇక హనుమంతుడు ధైర్యానికి ప్రతీకగా భావిస్తూ ఉంటారు కనుక ప్రతి ఒక్కరు ఆంజనేయ స్వామి ప్రసన్నం చేసుకోవడం కోసం ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు. ఇక ఆంజనేయస్వామిని ప్రసన్నం చేసుకోవాలి అంటే ఆయనకు సింధూరంతో అభిషేకం చేయడం తమలపాకుల హారంతో పూజించడం వంటివి చేస్తే చాలు ఆంజనేయస్వామి ప్రీతి చెంది ప్రసన్నలవుతారు.
ఆంజనేయ స్వామికి సింధూరంతో పూజ చేయటం వల్ల ఎలాంటి భయాలు లేకుండా దీర్ఘాయుష్యులుగా ఉంటారని భావిస్తారు అలాగే స్వామివారికి తమలపాకు హారం వేసి పూజించడం వల్ల సకల సంపదలు కలుగుతాయని చెబుతారు. ఇకపోతే అమావాస్య, కృష్ణ, శుక్ల పక్ష నవమి తిధినాడు వెన్నభిషేకం చేస్తే మంచి ఫలితం వస్తుందని చెబుతారు. వెన్నతో అభిషేకం చేస్తే దోషాలు , ఆర్ధిక ఇబ్బందులు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.