Anchor Anasuya : యాంకర్ అనసూయ భరద్వాజ్ ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. తరచుగా వర్తల్లో ఉంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. అనేక వివాదాల్లో చిక్కుకుంటూ కొన్ని సందర్భాల్లో పోలీసులను కూడా ఆశ్రయించింది అనసూయ. అనసూయ నిత్యం సోషల్ మీడియాలో ఏదో రకంగా యాక్టివ్ గా ఉంటూ ట్రోలర్స్ కి దిమ్మతిరిగే పోస్ట్ లు పెడుతుంటుంది. రీసెంట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సంబంధించిన మ్యాటర్ లోనూ ఓ నెటిజన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి అనసూయ హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పుడు పుష్ప సినిమాపై అనసూయ ఏదో కామెంట్స్ చేసిందని నెటిజన్స్ మరోసారి ఆమె వెనకాల పడ్డారు.
సుకుమార్ డైరెక్షన్లో ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటించిన మూవీ పుష్ప ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో కలెక్షన్లక్షల వర్షం కురిపించిందో తెలిసిందే. సౌత్ లోనే కాదు నార్త్ లోనూ ఈ సినిమా ఓ ఊపు ఊపేసింది. రికార్డుల మూత మోగించింది. మోత. ఈ సినిమాలోని అల్లు అర్జున్ యాక్టింగ్ గాను నేషనల్ అవార్డు సైతం లభించింది. కొంతకాలం సోషల్ మీడియాలో పుష్ప మానియా కొనసాగింది.. ఈ మూవీలో ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ తో పాటు రష్మిక, చాలామంది సీనియర్ యాక్టర్లు నటించారు. యాంకర్ అనసూయ కూడా ఈ మూవీలో స్పెషల్ కరెక్టర్ ను పోషించింది. మంగళం శీను భార్య దాక్షాయినిగా నటించింది. కాస్త నేగటివ్ షేడ్స్ ఉన్నా అనసూయ క్యారెక్టర్ కు కూడా మంచి గుర్తింపు లభించింది. ప్రస్తుతం పుష్ప2 షూటింగ్ జరుగుతుంది. సినిమాకు సంబంధించి అల్లుఅర్జున్ పై అనసూయ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
అనసూయ ఏముందంటే.. ” పుష్ప1 మూవీ ఫీడ్ బ్యాక్ ను అల్లు అర్జున్ మొత్తం తీసుకున్నారు. ప్రతి విషయం పైన అల్లు అర్జున్ రియాక్ట్ కాకపోవచ్చు. కానీ సోషల్ మీడియాలో ఆయన చాలా యాక్టివ్ గా ఉంటాడు. ప్రతి మెసేజ్ చదువుతాడు. మరి ముఖ్యంగా డాన్స్ మూమెంట్స్ కు సంబంధించి వచ్చిన కామెంట్స్ ను ఆయన దృష్టిలో పెట్టుకుని పుష్ప2లో మరింత శ్రద్ధ పెట్టి పర్ఫార్మ్ చేస్తున్నారు. డాన్స్ విషయంలోనే కాదు తన పాత్ర విషయంలోనూ ఎలాంటి తప్పులు జరగకూడదని స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు. నా క్యారెక్టర్ పైన ఆయనకు కంప్లైంట్ వచ్చింది. రెండో భాగంలో నా క్యారెక్టర్ తో పాటు ఫహద్ ఫాజిల్, సునీల్, బ్రహ్మాజీల సీన్స్ ఉంటాయి. ది రైజ్ కి మించి ది రూల్ ఉంటుంది ” అని అనసూయ ఓ ఇంటర్వ్యూ లో కామెంట్ చేసింది.
అనసూయ చేసిన ఈ కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.దీంతో ఎక్స్ వేదికగా అనసూయ రియాక్ట్ అయింది అసలు నేను అలా అనలేదని అందులో ఎలాంటి నిజం లేదని కావాలనే తన కామెంట్స్ ని తారుమారు చేశారని అనసూయ చెప్పుకొచ్చింది.