Anasuya Bharadwaj: ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ ఇటీవల మార్కాపురంలో జరిగిన ఒక షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి హాజరైన సందర్భంగా, ఆమెపై కొందరు పోకిరీలు చేసిన అసభ్యకర వ్యాఖ్యలకు దీటుగా స్పందించారు. వేదికపైనే నిలబడి ఆమె ఇచ్చిన గట్టి కౌంటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వేదికపై మాట్లాడుతుండగా, ప్రేక్షకుల్లోని కొందరు అసభ్యకర కామెంట్లు చేయడం ప్రారంభించారు. దీనిపై అనసూయ వెంటనే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, “అసభ్యకర కామెంట్లు చేస్తే చెప్పు తెగుద్ది. మీ ఇంట్లో చెల్లి, అమ్మ, గర్ల్‌ఫ్రెండ్, భార్యలని ఇలాగే ఏడిపిస్తే ఊరుకుంటారా? పెద్దవాళ్లను ఎలా గౌరవించాలి, వారితో ఎలా మెలగాలి అనేది ఇంట్లో నేర్పలేదా?” అని గట్టిగా మందలించారు.

Anasuya Bharadwaj: ఎలాంటి పాత్రలోనైనా అద్భుతంగా పర్ఫార్మ్ చేస్తున్నారు.
అనసూయ స్పందనతో అక్కడ ఉన్న జనాలు చప్పట్లతో ఆమెకు మద్దతు తెలిపారు. ఆకతాయిలు మాత్రం సైలెంట్ అయ్యారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. నెటిజన్లు ఆమె ధైర్యాన్ని ప్రశంసిస్తూ, “వేదికపై ఇలా స్ట్రాంగ్‌గా రియాక్ట్ అవ్వడం చాలా మంచిది,” “అనసూయ ఇచ్చిన కౌంటర్‌కి సాల్యూట్” అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి సంఘటనల్లో మహిళలు ధైర్యంగా ఎలా స్పందించాలో అనసూయ చూపించారని చాలామంది అభిప్రాయపడ్డారు.
ఇక, అనసూయ ఎక్కువగా టీవీ షోలతో విపరీతమైన పాపులారిటీని సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత.. క్షణం, రంగస్థలం, పుష్ప లాంటి సినిమాలతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. ఎలాంటి పాత్రలోనైనా అనసూయ అద్భుతంగా పర్ఫార్మ్ చేస్తున్నారు. ఆమే పోషించిన పాత్రలకి సినీ ప్రముఖుల నుంచి కూడా మంచి ప్రశంసలు దక్కుతున్నాయి.

