Anasuya Bharadwaj : రాజకీయాల్లోకి రంగమ్మత్త..పొలిటికల్ ఎంట్రీపై అనసూయ ఏమందంటే?

Anasuya Bharadwaj : చిత్ర పరిశ్రమకు..పాలిటిక్స్‎కు ఉన్న రిలేషన్ ఇప్పటిది కాదు. దివంగత నేత నందమూరి తారకరామారావు నుంచి..ఇప్పటి పవన్ కళ్యాణ్ వరకు ఎంతో మంది తారలు రాజకీయ రంగంలో ప్రవేశించి తమ సత్తాను చూపించారు. నటనతో సినీరంగంలో ప్రేక్షకులను అలరించడమే కాదు. రాజకీయాల్లో తమదైన ఎత్తుగడలతో ఎంతో మంది నటులు ప్రత్యర్థ పార్టీలను చిత్తుగా ఓడించారు. స్టార్ హీరోలే కాదు..వెండితెర స్టార్ హీరోయిన్లు, బిల్లితెర యాంకర్లు, నటీమణులు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన వాళ్ల లిస్టులో ఉన్నారు. సినీ రంగంలో కాస్త స్టార్డమ్ సంపాదిస్తే చాలు..మీరు రాజకీయాల్లోకి వస్తారా అంటూ అందరూ ప్రశ్నిస్తుంటారు. ఇప్పుడదే క్వశ్చన్ హాట్ బ్యూటీ, బుల్లితెర స్టార్ యాంకర్ అనసూయకు ఎదురయింది. అక్కడితో ఆగలేదు. అనసూయ పొలిటికల్ ఎంట్రీకి అంతా రెడీ చేసుకుందన్న రూమర్స్ నెట్టింట్లో జోరుగా వినిపిస్తున్నాయి. దీంతో లేటెస్టుగా ఈ వార్తపై అనసూయ క్లారిటీ ఇచ్చింది.

anasuya-bharadwaj-anchor-gives-clarity-on-her-political-entry

ఈటీవీలో ప్రసారమయ్యే కామెడీ షో జబర్దస్త్ షోకు యాంకర్ గా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది అనసూయ. ఈ భామ ఎంట్రీతో బుల్లితెరపైన యాంకర్ల వ్యవహారమే మారిపోయింది. ఒకప్పుడు సినిమాల్లోనే హీరోయిన్లు పొట్టి బట్టలతో కనిపించేవారు. కానీ అనసూయ రాకతో బుల్లితెరమీద అందాల ఆరబోత ప్రారంభమైంది. పొట్టి పొట్టి దుస్తులు ధరిస్తూ తన అందాలను ఆరబోస్తూ అనసూయ తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. అలా దిగ్విజయంగా తన బుల్లితెర జర్నీ కొనసాగుతుండగానే అనసూయకు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అయితే రంగస్థలంలో అనసూయ రంగమ్మత క్యారెక్టర్ కి మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత సూపర్ డూపర్ హిట్ సాధించిన పాన్ ఇండియా సినిమా పుష్పలోనూ నెగిటివ్ షేడ్ లో అదరగొట్టింది. తన నటనతో మెప్పించింది.

anasuya-bharadwaj-anchor-gives-clarity-on-her-political-entry

ప్రస్తుతం అనసూయ రజాకార్ అనే సినిమాతో త్వరలో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యింది. ఈ మూవీకి సంబంధించిన ఓ సాంగ్ తాజాగా సోషల్ మీడియాలో విడుదలైంది. ఈ సినిమా ఈవెంట్ వచ్చిన అనసూయకు ఈ ప్రశ్న ఎదురైంది. రజాకార్ సినిమా పొలిటికల్ నేపథ్యంతో వస్తుండటం, ఆ మూవీ ప్రొడ్యూజర్ బీజేపీ లీడర్ కావడంతో అనసూయ రాజకీయ రంగ ప్రవేశంపై చర్చ మొదలు అయ్యింది. ఇక మీడియా కూడా ఈ ఈవెంట్ లో అనసూయను అదే ప్రశ్న అడిగింది. అయితే అనసూయ మాత్రం అదంతా జస్ట్ రూమర్ అని కొట్టిపారేసింది. అంతే కాదు తనకు పాలిటిక్స్ అంటే అస్సలు ఇంట్రెస్ట్ లేదని చెప్పుకొచ్చింది. రాజకీయాలు చేయడం తనవల్ల కాదని క్లారిటీ ఇచ్చేసింది. ఇక రజాకార్ మూవీ ప్రొడ్యూజర్ బీజేపీ లీడర్ కదా, ఎప్పుడైన మీ మధ్య పాలిటిక్స్ గురించి చర్చ జరిగిందా అని మీడియా ప్రశ్నించింది. అసలు తమ మధ్య ఎప్పుడూ అలాంటి టాపిక్ రాలేదని క్లారిటీ ఇచ్చింది. మరి ఫ్యూచర్లో ఏమైనా అనసూయ ఈ విషయంలో మనసు మార్చుకుంటుందో లేదో వేచి చూడాల్సిందే.

Sri Aruna Sri

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

1 week ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

1 week ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

4 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

4 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

4 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.