Ananya Pandey : అనన్య పాండే మరియు ఆదిత్య రాయ్ కపూర్ తరచుగా బాలీవుడ్ పార్టీలలో కలిసి కనిపిస్తూ హెడ లైన్స్ లో నిలుస్తున్నారు. . 2022లో కృతి సనన్ దీపావళి పార్టీలో వీరిద్దరూ కలిసి కనిపించిన తర్వాత వారిపై డేటింగ్ పుకార్లు పుట్టుకొచ్చాయి. అప్పటి నుండి, ఆదిత్య, అనన్యలు ఎప్పుడు కనిపించినా వీరి రిలేషన్ గురించి టాపిక్ నడుస్తూనే ఉంటుంది.
తాజాగా ఈ జోడి లాక్మే ఫ్యాషన్ వీక్ గ్రాండ్ ఫినాలేలో తలుక్కుమంది. ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా కోసం షోస్టాపర్‌లుగా మారి తమ అభిమానులను విస్మయానికి గురి చేశారు.
లాక్మే ఫ్యాషన్ వీక్ ముగింపు వేడుకలో మనీష్ మల్హోత్రా కోసం అనన్య పాండే, ఆదిత్య రాయ్ కపూర్ కలిసి ర్యాంప్ పై నడిచారు. ర్యాంప్‌పై నడుస్తున్నప్పుడు, ఇద్దరు నటీనటుల కెమిస్ట్రీ అద్భుతంగా ఉంది. ఈ కెమిస్ట్రీ వారి ఎఫైర్ వార్తలకు మరింత అజ్యాన్ని పోసింది ఇచ్చింది.
అనన్య బ్లాక్ ప్రింటెడ్ బాడీకాన్ గౌను కేప్ లాంటి జాకెట్ ధరించి ఆదరగొట్టింది. మరోవైపు, ఆదిత్య నలుపు రంగు సూట్‌లో అందంగా కనిపించాడు. వీరిద్దరి డ్రెస్ కాంబినేషన్ ర్యాంపై అదరగొట్టింది.అనన్య, ఆదిత్య, మనీష్ మల్హోత్రా యొక్క కొత్త సేకరణను ప్రదర్శించారు. ముందుగా ఇద్దరూ విడివిడిగా నడిచారు. తర్వాత ఇద్దరూ కలిసి నడుస్తూ కనిపించారు.
ఫ్రంట్ పార్ట్ ఓపెన్ గా డీప్ నెక్ లైన్ తో టైట్ ఫిట్ డీటెయిల్స్ తో వచ్చిన డ్రెస్ఓ అనన్య ఎంతో అందంగా కనిపించింది. తొడ వరకు వచ్చిన భారీ స్లిట్ ఆమె థై అందాలను చూపిస్తున్నాయి. కురులను లూజ్ గా వదులుకొని మినిమల్ మేకప్ తో మెస్మెరైజింగ్ లుక్స్ తో అందరినీ చంపేస్తుంది
బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే విజయ దేవరకొండ తో జోడి కట్టి లైగర్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. మొదటి సినిమా అంత ఆశించిన హిట్ రాకపోవడంతో అమ్మడికి పెద్దగా అవకాశాలు రాలేదని చెప్పాలి. దీంతో బాలీవుడ్ కి పరిమితమైంది బ్యూటీ. అక్కడ అడపాదనపు వచ్చే సినిమాల్లో నటిస్తూనే ఫ్యాషన్ స్టైల్స్ తో ప్రేక్షకులను అలరిస్తోంది. సినిమాల కన్నా సోషల్ మీడియా ద్వారానే ఈ భావం గుర్తింపును సంపాదించుకుంది. అప్పుడప్పుడు తన ఇంస్టాగ్రామ్ లో పిక్స్ పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ ను అలరిస్తోంది. తాజా పిక్స్ కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి ఈసారి తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి స్టేజ్ మీద హల్ చల్ చేసింది.